TG Electric Ambulance : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కరెంట్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి విద్యుత్‌ అంబులెన్సులు-electric ambulances available in hyderabad city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Electric Ambulance : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కరెంట్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి విద్యుత్‌ అంబులెన్సులు

TG Electric Ambulance : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కరెంట్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి విద్యుత్‌ అంబులెన్సులు

Published Oct 22, 2024 12:17 PM IST Basani Shiva Kumar
Published Oct 22, 2024 12:17 PM IST

  • TG Electric Ambulance : దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. హైదరాబాద్ నగరంలో విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని.. విద్యుత్ సంస్థ అధికారులు వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా.. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు.. అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

(1 / 5)

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 57 సబ్ డివిజన్‌లకు 57 విద్యుత్ అంబులెన్స్‌లను కేటాయించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈ వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రారంభించారు.

(2 / 5)

ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది.. అవసరమైన మెటీరియల్‌తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు. ప్రతి వాహనంలో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపము మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్, అవసరమైన అన్ని భద్రతా పరికరాలు, సాధనాలతో ఈ వాహనం సిద్ధంగా ఉంటుంది.

(3 / 5)

ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే సిబ్బంది వెంటనే వచ్చి సమస్య పరిష్కరించేలా.. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ విద్యుత్‌ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

(4 / 5)

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించేందుకు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ ప్రత్యేక వాహనాలు ప్రారంభించామని.. భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యుత్‌ ప్రమాదం జరిగినా, సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబరుకు ఫోన్‌ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఈ వాహనాల్లో వస్తారని వివరించారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు