(1 / 6)
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ప్రకటన జారీ కాలేదు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు.
(2 / 6)
ఈ నెలలోనే 16,473 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో డీఎస్సీకి ఏ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా కేసులు పడేవని గుర్తు చేశారు. కానీ ఈసారి అలా కాకుండా… లోటుపాట్లను అన్నింటిని సరిచేసి.. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని వివరించారు.
(3 / 6)
రిజర్వేషన్ల ఖరారు విషయంతోనే డీఎస్సీ ప్రక్రియ ఆలస్యమైందని లోకేశ్ తెలిపారు. ఈ మార్చి నెలలో తప్పకుండా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్లపై దాఖలైన కేసులను పరిశీలించాలని… కూటమి ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ విషయంలో ఎలాంటి తప్పిదాలు ఉండొద్దని అధికారులకు సూచించామని తెలిపారు.
(4 / 6)
ఏపీ డీఎస్సీలో కర్నూల్ జిల్లాకు పెద్ద ఎత్తున కొత్త ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని.. కర్నూల్ పార్లమెంట్ పరిధిలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
(5 / 6)
టీచర్ల సీనియారిటీ జాబితాను త్వరలోనే బహిర్గతం చేస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని… ఎలాంటి యాప్‌ల గొడవ ఉండదని క్లారిటీ ఇచ్చారు.
(6 / 6)
వన్ క్లాస్-వన్ టీచర్ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్‌ను రూపొందిస్తున్నామని ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు