వేసవిలో ఈ ఆహారాలు తిన్నారంటే కాలేయంలో కొవ్వు పెరిగిపోతుంది జాగ్రత్త-eating these foods in summer can increase fat in the liver be careful ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వేసవిలో ఈ ఆహారాలు తిన్నారంటే కాలేయంలో కొవ్వు పెరిగిపోతుంది జాగ్రత్త

వేసవిలో ఈ ఆహారాలు తిన్నారంటే కాలేయంలో కొవ్వు పెరిగిపోతుంది జాగ్రత్త

Published May 21, 2025 09:34 AM IST Haritha Chappa
Published May 21, 2025 09:34 AM IST

వేసవిలో కొన్ని ఆహారాలు మన కాలేయానికి ప్రమాదకరంగా మారుతాయి. ఎలాంటి ఆహారాన్ని తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందో, పెరుగుతుందో తెలుసుకోండి.

అధిక చక్కెర ఉండే పదార్థాలను తినకూడదు. పంచదారతో చేసిన ఆహారాలు కాలేయంలో కొవ్వు చేరడానికి దారితీస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యలకు కారణమవుతుంది. ఈ రకమైన ఆహారంలో చాలా పిండి పదార్థాలు ఉంటాయి. దాన్ని కొవ్వుగా మార్చి కాలేయంలో నిల్వ చేసుకోవచ్చు.

(1 / 5)

ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా తినకూడదు.  ఈ రకమైన మాంసంలో అధిక మొత్తంలో సోడియం,కొవ్వు ఉంటుంది, ఇది కాలేయ పనితీరును తగ్గిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం మన కాలేయ ఎంజైమ్లను సరిగా జీర్ణించుకోదు.

(2 / 5)

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినేందుకు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఈ ఆహారాలలో కొవ్వు అధికంగా ఉంటుంది, ఇది కాలేయానికి హానికరం. వీటిలో ఉండే నూనె నుండి టాక్సిన్స్ ఏర్పడతాయి, ఇవి కాలేయంలో కొవ్వును పెంచేస్తుంది.

(3 / 5)

ఆల్కహాల్,ధూమపానం అలవాటు ఎంతో మందికి ఉంటుంది. ఈ రెండూ కూడా కాలేయంలో సమస్యను పెంచుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది.

(4 / 5)

కాలేయాన్ని కాపాడుకోవడానికి వేసవిలో అధికంగా ద్రవాహారాలను తీసుకోవాలి.  నీరు అధికంగా త్రాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు,  ధాన్యాలు వంటి ఆహారాన్ని తినండి. ఫాస్ట్ ఫుడ్, ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటివి తీసుకోకూడదు.  మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను వెంటనే మానేయాలి.

(5 / 5)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు