stocks Review: ఐసీఐసీఐ డైరెక్ట్ సజెస్ట్ చేస్తున్న ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయండి..
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాల ఆధారంగా ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) ఇన్వెస్టర్ల కోసం ఐదు స్టాక్స్ ను సజెస్ట్ చేస్తోంది. అవేంటో మీరు కూడా చూడండి..
(1 / 5)
ABB India: ఏబీబీ ఇండియా. ఈ స్టాక్ ను కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫారసు చేస్తోంది. దీని టార్గెట్ ప్రైస్ గా రూ. 3,735గా అంచనా వేస్తోంది. Q3 లో ఈ సంస్థ ఆదాయంలో 15.5% వృద్ధి కనబర్చింది. గత ఏడాది Q3 కన్నా ఈ Q3 లో పన్ను అనంతర లాభాల్లో 58% వృద్ధి సాధించింది. (AFP)
(2 / 5)
Bank of Baroda: ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న స్టాక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. ఇది భారత్ లోని ప్రముఖ వాణిజ్య బ్యాంక్ ల్లో ఒకటి. ఈ Q3 లో Bank of Baroda మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ లాభాల్లో గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో 75.4% వృద్ధి నమోదైంది. క్రెడిట్ గ్రోత్ 19.7%గా నమోదైంది. ఎన్పీఏలు తగ్గాయి.
(3 / 5)
Dr Reddy's: ప్రముఖ ఫార్మాస్యుటికల్ కంపెనీ. ఈ కంపెనీ టార్గెట్ ప్రైస్ గా రూ. 5,210 ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. యూఎస్ బిజినెస్ లో మంచి గ్రోత్ రావడంతో Q3 లో రెడ్డీస్ ల్యాబ్స్ మంచి ఫలితాలను సాధించింది. గత Q3 కన్నా ఈ Q3 లో ఈ సంస్థ 64% ఆదాయం పెరిగింది. భారత్, యూఎస్ లతో పాటు రష్యా, యూరోప్ దేశాల్లోనే మంచి ఫలితాలను సాధించింది.(Pixabay)
(4 / 5)
Larsen and Toubro: లార్సన్ అండ్ టబ్రో. ఈ ఇన్ ఫ్రా స్టాక్ టార్గెట్ ప్రైస్ ను రూ. 2,795గా ఐసీఐసీఐ డైరెక్ట్ నిర్ధారించింది. Q3FY23 లో Larsen and Toubro 8.3% స్టాండ్ అలోన్ రెవెన్యూ వృద్ధిని సాధించింది.(MINT_PRINT)
(5 / 5)
Tata Motors: టాటా మోటార్స్ టార్గెట్ ప్రైస్ ను రూ. 530 గా ICICI Direct అంచనా వేస్తోంది. టాటా వాహనాల అమ్మకాల్లో నమోదవుతున్న రికార్డు స్థాయి వృద్ధి, Q3FY23 లో గత ఏడు త్రైమాసికాల అనంతరం తొలి సారి సానుకూల ఫలితాలను ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు