(1 / 8)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల తిరుమల చేరుకున్నారు. రేపు వేకువజామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు.
(2 / 8)
తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా కొణిదల..గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.
(3 / 8)
అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆమె సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
(4 / 8)
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో తిరుమల స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి అన్నా లెజినోవా తిరుమల వచ్చారు.
(5 / 8)
ఇటీవల సింగపూర్ సమ్మర్ క్యాంప్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ కోలుకోవడంతో ఇండియా తీసుకొచ్చారు.
(6 / 8)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నా కొణిదల మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వరాహ స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు.
(7 / 8)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి ఇవాళ ఇండియాకు తిరిగొచ్చారు. మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడిందని, కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇతర గ్యాలరీలు