Railway Information : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం.. ఇప్పటివరకున్న అప్‌డేట్స్ ఇవే
- Railway Information : ఏపీ, తెలంగాణలో వర్షాలు ఎడతేరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో ఎక్కడి రైళ్లను అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

(1 / 6)
వర్షాల ప్రభావంతో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. నాందేడ్- సంబల్‌పుర్ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్.. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలు 2 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ సాయంత్రం 4.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును 6.50 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
(2 / 6)
మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో మహబాబూబాద్ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లును మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆపేశారు.
(3 / 6)
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షానికి మఠంపల్లిలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబాబూబాద్ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.
(4 / 6)
వర్షాల ప్రభావంతో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. నాందేడ్- సంబల్‌పుర్ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్.. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలు 2 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ సాయంత్రం 4.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును 6.50 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
(5 / 6)
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. శనివారం రాత్రే.. రాయనపాడులో తమిళనాడు ఎక్స్ ప్రెస్‌ని అధికారులు ఆపేశారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో.. స్టేషన్ నుండి ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా ప్రయాణీకులను.. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైకి చేర్చారు.
(6 / 6)
భారీ వర్షాలు, వరదల కారణంగా రైళ్లు రద్దు, దారి మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, రాయనపాడు, కొండపల్లి రైల్వే స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉండిపోయారు. ట్రైన్‌లో హైదరాబాద్ వెళ్తుండగా.. దాన్ని మహబూబాబాద్‌లో ఆపేశారు.
ఇతర గ్యాలరీలు