అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే-dr br ambedkar open university updates ug pg and d ug pg and diploma admission notification 2025 released key dates here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

Published Jun 18, 2025 10:01 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 18, 2025 10:01 AM IST

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలపై ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పించనున్నారు.  అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. .

(1 / 7)

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

(2 / 7)

డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉండాలి.  పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.

(3 / 7)

ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజుతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి.  అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు.

(4 / 7)

అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు ఆగస్టు 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణయించన అప్లికేషన్ ఫీజును చెల్లించుకోవాలి.

(5 / 7)

(https://ts-braouphdcet.aptonline.in/)

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక కాంబినేషన్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంచుకోవచ్చు.కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

(6 / 7)

కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు.  వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 04023680222/333/444/555 లేదా 7382929570 సంప్రదించవచ్చు, అంతేకాకుండా 18005990101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు