(1 / 7)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి,
(2 / 7)
ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 గృహాలు మంజూరు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీన్ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అర్హులైన వారిని గుర్తించి… ఇళ్లను మంజూరు చేస్తామని చెబుతోంది.
(3 / 7)
అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో సొంత జాగ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి విడతలో ఎక్కువ మందిని ఈ కేటగిరి కిందనే గుర్తించారు. అయితే ఖాళీ జాగలు లేని వారు ఆందోళన చెందుతన్నారు. తమ విషయంలో ప్రభుత్వం ఆలోచించి… ఇళ్ల నిర్మించాలని కోరుతున్నారు.
(4 / 7)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు అర్హత ఉన్నప్పటికీ ఖాళీ జాగ లేని వారి విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
(5 / 7)
గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా పూర్తి చేసుకునేలా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఆ ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించారు.
(6 / 7)
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేందుకు అర్హులను గుర్తించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
(7 / 7)
అర్హులను గుర్తించినప్పటికీ… లాటరీ విధానంలో ఇళ్లను కేటాయించే విషయంపై సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు