(1 / 8)
సూర్యభగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఆ రోజును సంక్రాంతి అంటారు. సూర్యభగవానుని ఆరాధనకు, దానధర్మాలకు ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది జూన్ 15న సూర్యభగవానుడు వృషభ రాశిని వీడి మిథున రాశిలో ప్రవేశిస్తాడు.. ఈ రోజున మిథున సంక్రాంతి జరుపుకొంటారు.
(2 / 8)
మత విశ్వాసాల ప్రకారం సంక్రాంతి రోజున సూర్యభగవానుని ఆరాధించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. అన్ని రకాల శారీరక, మానసిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉండటం వల్ల వృత్తి, వ్యాపారం, గౌరవం పెరుగుతాయి.
(3 / 8)
మీరు మిథున సంక్రాంతి రోజున సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలనుకుంటే స్నానం, ధ్యానం, ఆరాధన తర్వాత ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయండి.
(4 / 8)
గోధుమ దానం : గోధుమలు దానం చేస్తే మీకు సూర్యుడి బలం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారంలో పురోగతిని తెస్తుంది.
(5 / 8)
పప్పుల దానం : పప్పులు దానం చేసినా సూర్యభగవానుడు సంతోషిస్తాడు. దీనిని అవసరమైన వారికి దానం చేయడం పవిత్రంగా భావిస్తారు.
(6 / 8)
బెల్లం దానం : సూర్యుడికి బెల్లం కలిపిన నీటిని సమర్పించడంతో పాటు బెల్లం లేదా తీపి పదార్థాలను దానం చేయడం పవిత్రంగా భావిస్తారు.
(7 / 8)
ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయండి : భాస్కరుడిని పూజించిన తరువాత పేదలకు ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి. కోరిక తీరుస్తుంది.
(8 / 8)
హిందూ క్యాలెండర్ ప్రకారం మిథున సంక్రాంతి రోజు ఉదయం 6:53 నుండి మధ్యాహ్నం 2:19 గంటల వరకు పుణ్యకాలు ఉంటాయి. ఈ రోజు ఉదయం 6:53 గంటల నుంచి 9:12 గంటల వరకు మహా పుణ్యకాలం ఉంటుంది. శుభకాలం, మహా పుణ్యకాలంలో దానధర్మాలు చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఇతర గ్యాలరీలు