Indian Railways : ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ 5 రైళ్లలో ప్రయాణించాలి!
- Indian Railways : ప్రపంచంలో భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆ క్రమంలో ఎన్నో అద్బుతాలను చూపిస్తోంది. మరిచిపోలేని అనుభూతిని ప్రయాణికులకు అందిస్తోంది. ముఖ్యంగా 5 రైళ్లు భారతీయ రైల్వేలో ప్రత్యేకం అని చెప్పాలి.
- Indian Railways : ప్రపంచంలో భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆ క్రమంలో ఎన్నో అద్బుతాలను చూపిస్తోంది. మరిచిపోలేని అనుభూతిని ప్రయాణికులకు అందిస్తోంది. ముఖ్యంగా 5 రైళ్లు భారతీయ రైల్వేలో ప్రత్యేకం అని చెప్పాలి.
(1 / 6)
భారతదేశంలో రైలు ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన పట్టణాలు, నిర్మలమైన గ్రామీణ ప్రాంతాల గుండా సాగే ప్రయాణం జీవితంలో మర్చిపోలేము. ఔత్సాహికులు, సాహసం చేయాలనుకునే వారి కోసం.. దేశంలో కొన్ని రైళ్లు ఉన్నాయి. అవే ఐదు పొడవైన రైలు మార్గాలు. ఇవి దేశవ్యాప్తంగా మరపురాని ప్రయాణాన్ని అందిస్తాయి.(@RailMinIndia)
(2 / 6)
వివేక్ ఎక్స్‌ప్రెస్.. భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు. ఇది అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడుస్తుంది. దాదాపు 4,200 కి.మీ. వారానికోసారి నడుస్తుంది. సుమారు 80 గంటలు ప్రయాణం చేస్తుంది. 50 స్టాప్‌లు ఉంటాయి. వివేక్ ఎక్స్‌ప్రెస్.. అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుండి కన్యాకుమారి ఇసుక తీరం వరకు ఎన్నో అద్బుతమైన దృశ్యాలను చూపిస్తుంది.(@MunnaBella79294)
(3 / 6)
హింసాగర్ ఎక్స్‌ప్రెస్.. దేశంలో ఉన్న మరో పొడవైన రైలు మార్గం. ఈ రైలులో జీవితంలో ఒక్కసారైన ప్రయాణించాలని చాలామంది అనుకుంటారు. ఇది కన్యాకుమారి నుంచి జమ్మూ- కాశ్మీర్ మధ్య 3,800 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. దాదాపు 73 గంటల 5 నిమిషాలు ప్రయాణిస్తుంది. హింసాగర్ ఎక్స్‌ప్రెస్ 12 రాష్ట్రాలను దాటుతుంది. 71 స్టేషన్లలో ఆగుతుంది. జమ్మూలోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.(@RailMinIndia)
(4 / 6)
మరొక ప్రముఖ సుదూర రైలు దిబ్రూగర్ ఎక్స్‌ప్రెస్. అస్సాంలోని న్యూ టిన్సుకియా నుండి స్టార్ట్ అయ్యి.. మహారాష్ట్రలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు 3,547 కి.మీ. ఈ ప్రయాణం చేస్తుంది. సుమారు 68 గంటల పాటు ప్రయాణం కొనసాగుతుంది. 35 స్టాప్‌లు ఉంటాయి. దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులు గౌహతి, కోల్‌కతా, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల అందాలను చూడొచ్చు. (@MunnaBella79294)
(5 / 6)
సిల్చార్-కోయంబత్తూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది అస్సాంలోని సిల్చార్, తమిళనాడులోని కోయంబత్తూరు మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణిస్తే.. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.(@MunnaBella79294)
(6 / 6)
కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్.. కేరళలోని తిరువనంతపురం నుండి పంజాబ్‌కు వెళ్తుంది. ఇది 3,398 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు దాదాపు 54 గంటల 25 నిమిషాలలో నడుస్తుంది. తొమ్మిది రాష్ట్రాలలో 22 స్టాప్‌లు ఉన్నాయి. ఇది భారతదేశం దక్షిణ, ఉత్తర రాష్ట్రాల మధ్య కీలక ట్రైన్‌గా ఉంది. ఈ రైలు ఆధ్యాత్మిక, ఆహ్లాద ప్రదేశాల గుండా ప్రయాణించి మంచి అనుభూతిని ఇస్తుంది. (@MunnaBella79294)
ఇతర గ్యాలరీలు