రూ. 14 వేలు, 3 విడతలు....! 'అన్నదాత సుఖీభవ' స్కీమ్ డబ్బుల జమ ఇలా...-do you know the details of the money given under the ap annadata sukhibhav scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రూ. 14 వేలు, 3 విడతలు....! 'అన్నదాత సుఖీభవ' స్కీమ్ డబ్బుల జమ ఇలా...

రూ. 14 వేలు, 3 విడతలు....! 'అన్నదాత సుఖీభవ' స్కీమ్ డబ్బుల జమ ఇలా...

Published Jun 08, 2025 03:46 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 08, 2025 03:46 PM IST

‘అన్నదాత సుఖీభవ’ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ సర్కార్ కార్యాచరణను సిద్ధం చేసింది. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటి నిధులను విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటిగా ఏడాదికి రూ. 14 వేలు అందజేస్తుంది. అయితే ఎప్పుడు ఎంత ఇస్తుందో ఇక్కడ తెలుసుకోండి…

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 6 వేలు ఉంటాయి.

(1 / 7)

అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పంట పెట్టుబడి సాయం రూ. 14 వేలుగా ఉంటుంది. మిగతా ఆరు వేలు కేంద్రం నుంచి వస్తాయి.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగానే ఈ స్కీమ్ ను  రూపొందించారు.

(2 / 7)

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. డీబీటీ విధానంలో డబ్బులు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.

(3 / 7)

పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి ఏడాదిలో మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు జమ చేస్తుంది. అంటే ఒక్కో విడతలో లబ్ధిదారుడి ఖాతాలో రూ. 2 వేలు వేస్తుంది. ఈ మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులను కూడా జమ చేయాలని నిర్ణయించింది. అంటే 14 వేలను విడుతల వారీగా అందజేయనుంది.

(4 / 7)

పీఎం కిసాన్‌ కింద జూన్ 20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి విడతగా రూ.5వేల చొప్పున జమచేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు రూ.7వేలు అందుతాయి.

(5 / 7)

ఇక రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు అందజేస్తుంది. మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో  రూ.4వేలు అందజేస్తుంది. అంటే మూడు విడతలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు ఖాతాలోకి రూ. 14 వేలు చేరుతాయి.

(6 / 7)

అన్నదాత సుఖీభవ స్కీమ్ ను భర్త, భార్య, పిల్లలతో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అమలుచేస్తారు. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్ గా పరిగణించి, పెట్టుబడి సాయం అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కార్యాలయాలు, ఇతర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. https://annadathasukhibhava.ap.gov.in/home-tel వెబ్ సైట్ లోకి వెళ్లి లబ్ధిదారుల స్టేటస్ వివరాలను ఆధార్ నెంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు