(1 / 8)
(2 / 8)
అల్వీరా, అతుల్ అగ్నిహోత్రి ప్రేమకథ 1992లో వచ్చిన జాగృతి చిత్రంతో మొదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు అతుల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అల్వీరా తరచూ తన సోదరుడిని కలవడానికిి ఈ సినిమా సెట్స్ కు వచ్చేది.
(3 / 8)
జాగృతి సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. సినిమా షూటింగ్ పూర్తి కాగానే అల్వీరా, అతుల్ వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే, రెండు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
(4 / 8)
అతుల్ కుటుంబం వైపు నుంచి ఎటువంటి సమస్యా లేదు, కానీ ఈ వివాహానికి సల్మాన్ ఖాన్ తో పాటు తండ్రి సలీం ఖాన్ సమ్మతి అవసరం. అల్వీరా తన ప్రేమ గురించి భయపడుతూనే ముందుగా సల్మాన్ కు చెప్పింది.
(5 / 8)
సల్మాన్ కు కోపం వస్తుందని, పెళ్లికి ఒప్పుకోడని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సల్మాన్ వారి బంధానికి సమ్మతించాడు. అతుల్ ను వారి కుటుంబంలోకి ఆహ్వానించడానికి అంగీకరించాడు.
(6 / 8)
తన సోదరి అల్వీరా తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో సంతోషం వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాన్ సోదరులు కూడా ఈ వివాహాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారు. చిన్నప్పుడు సల్మాన్ అన్నదమ్ములు, చెల్లెలు ఒకే గదిలో ఉండేవారు. వారి మధ్య మంచి ఆప్యాయత, అనురాగం ఉన్నాయి.
(7 / 8)
సల్మాన్ అంగీకారంతో అల్వీరా అతుల్ ను తండ్రి సలీంఖాన్ కు పరిచయం చేసింది. తనకు ఈ వ్యక్తి అంటే ఇష్టమని చెప్పింది. దీనిపై సలీంఖాన్ స్పందిస్తూ.. 'నాకు కూడా నచ్చాడు' అని చెప్పాడు. కుటుంబ సభ్యుల అనుమతితో అల్వీరా 1995లో అతుల్ ను వివాహం చేసుకుంది.
(8 / 8)
వివాహానంతరం వారికి కుమారుడు అయాన్, కూతురు అలీజా జన్మించారు. రాబోయే కాలంలో అలీజా కొత్త మూవీ ప్రాజెక్ట్ లో కనిపించనుంది.
ఇతర గ్యాలరీలు