TG EAPCET Updates 2025 : విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- TG EAPCET(EAMCET) Syllabus Download 2025: తెలంగాణ ఈఏపీసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అయితే ఈ ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు….
- TG EAPCET(EAMCET) Syllabus Download 2025: తెలంగాణ ఈఏపీసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అయితే ఈ ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు….
(1 / 8)
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రవేశాల పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారులు అందుబాటులో ఉంచారు. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(2 / 8)
తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో Information అని డిస్ ప్లే అవుతుంది. దీని కిందనే Syllabus అని ఉంటుంది. దీనిపై నొక్కాలి.
(3 / 8)
సిలబస్ పై నొక్కగానే ఇంజినీరింగ్ స్ట్రీమ్ తో పాటు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ పరీక్ష అయితే రాస్తున్నారో దానిపై క్లిక్ చేయాలి. మీకు సిలబస్ వివరాలతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
(4 / 8)
ఇక తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా కొనసాగుతుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వరకు కూడా దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.
(5 / 8)
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(6 / 8)
మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాయాల్సి ఉంటుంది.
(7 / 8)
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి.ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
(8 / 8)
- ఈ లింక్ పై క్లిక్ చేసి ఇంజినీరింగ్ స్ట్రీమ్ సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ లింక్ పై క్లిక్ చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు