AP DSC Notification 2025 : ఏపీ మెగా డీఎస్సీ అప్డేట్స్ - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!
- AP DSC Syllabus Download : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే విషయంపై తాజాగా సీఎం చంద్రబాబుతో సహా విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా కీలక ప్రకటన చేశారు. అయితే డీఎస్సీ సిలబస్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి….
- AP DSC Syllabus Download : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే విషయంపై తాజాగా సీఎం చంద్రబాబుతో సహా విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా కీలక ప్రకటన చేశారు. అయితే డీఎస్సీ సిలబస్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి….
(1 / 7)
ఏపీలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన జారీ కానుంది. మొత్తం 16 వేల 347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటన ఇవ్వనున్నారు. ఇదే విషయంపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
(2 / 7)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించిన చంద్రబాబు… ఈ అంశంపై స్పందించారు. 'త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే.. ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలి" అని వ్యాఖ్యానించారు.
(3 / 7)
ఏపీలో ఫిభ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉంచిన సిలబస్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
(4 / 7)
డీఎస్సీ సిలబస్ కోసం ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే "MEGA DSC 2024 Suggestive Syllabus' ఆప్షన్ ఉంటుంది. దాని కిందనే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
(5 / 7)
డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ ఓపెన్ అవుతుంది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తో పాటు ఇతర పోస్టులకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో పేర్కొన్నారు.
(6 / 7)
ఏపీ మెగా డీఎస్సీ రాత పరీక్ష మొత్తం 80 మార్కులకు ఉంటుంది. జనరల్ నాల్డెజ్ కు 8 మార్కులు, Perspectives in Educationకు 4 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కులు ఉంటాయి. కంటెంట్ అండ్ మెథడలాజీకి 60 మార్కులు (40+20) ఉంటాయి. మరో 20 మార్కులు టెట్ స్కోర్ నుంచి వెయిటేజీ ఇస్తారు.
ఇతర గ్యాలరీలు