TG MLC Voter Application Status 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్స్ - మీ ఓటర్ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- Telangana MLC Voter Registration Status : ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- Telangana MLC Voter Registration Status : ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
(1 / 7)
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే షెడ్యూల్ రావటంతో ప్రస్తుతం ఈ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ లో భాగంగా ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ అయింది.
(2 / 7)
ఇందులో భాగంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం 3.50 లక్షలకుపైగా మంది ఓటర్లు దరఖాస్తులు చేసుకున్నారు.
(image source ceotelangana.nic.in)(3 / 7)
పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది.
(image source ceotelangana.nic.in)(4 / 7)
గ్రాడ్యుయేట్ లేదా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే MLC Graduates - Teacher ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
(image source ceotelangana.nic.in)(5 / 7)
ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు Track Your Status అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ ఓటరగా నమోదు చేసుకుంటే Form-18 (Graduate's) ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. లేదా టీచర్ గా ఉంటే Form-19(Teacher's)ను ఎంపిక చేసుకోవాలి.
(image source ceotelangana.nic.in)(6 / 7)
మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు జనరేట్ అయిన అప్లికేషన్ ఐడీ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. గేట్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తోంది. ఏమైనా తప్పులు ఉంటే… అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
(image source ceotelangana.nic.in)(7 / 7)
ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంటుంది.. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఇతర గ్యాలరీలు