TG Indiramma House Application Status : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - మీ 'అప్లికేషన్ స్టేటస్' ఇలా చెక్ చేసుకోండి
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్న వివరాల స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి సింపుల్ గా వివరాలు చెక్ చేసుకోవచ్చు.
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్న వివరాల స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి సింపుల్ గా వివరాలు చెక్ చేసుకోవచ్చు.
(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కనుంది. గ్రామసభల్లో అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత… అసలైన లబ్ధిదారులను ఫైనల్ చేసి జాబితాలను విడుదల చేయనున్నారు.
(2 / 8)
ఇందిరమ్మ ఇళ్ల కోసం 2023 ఏడాది డిసెంబర్ 28 నుంచి గతేడాది జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి.
(3 / 8)
భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయించింది. అన్ని వివరాలను యాప్ లో ఎంట్రీ చేసి.. అసలైన అర్హులను ఫైనల్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది.
(4 / 8)
అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే ప్రత్యేకంగా https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తామని ప్రకటించింది. అందుకు తగ్గిన విధంగానే ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
(5 / 8)
ఇక ప్రభుత్వం తీసుకువచ్చిన https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ లోనే దరఖాస్తుదారుడి వివరాలను తెలుసుకునేలా సరికొత్త ఆప్షన్ ను తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ ఆధారంగా… దరఖాస్తుదారుడి వివరాలను సింపుల్ గా తెలుసుకోవచ్చు.
(6 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ స్టేటస్ చేసుకోవాలనుకుంటే ముందుగా https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే Application Status ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ లేదా,FSC (పుడ్ సెక్యూరిటీ కార్డు) నెంబర్ ను ఎంట్రీ చేసి Go ఆప్షన్ పై నొక్కాలి.
(7 / 8)
ఇక్కడ దరఖాస్తుదారుడి పేరు, అప్లికేషన్ నెంబర్, జిల్లా, మండలం, గ్రామం వివరాలు కనిపిస్తాయి. ఫోన్ నెంబర్, ఎఫ్ఎస్ సీ కార్డు నెంబ్, ఆధార్ నెంబర్ తో పాటు సర్వేయర్ పేరు కూడా డిస్ ప్లే అవుతాయి.
ఇతర గ్యాలరీలు