AP MLC Elections 2025 : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు - మీ ఓటర్ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- AP MLC Voter Registration Status 2025: ఏపీలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ ఉంటుంది. మార్చి 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏపీ సీఈవో వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- AP MLC Voter Registration Status 2025: ఏపీలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ ఉంటుంది. మార్చి 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏపీ సీఈవో వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
(1 / 8)
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుండగా… ఉత్తరాంధ్ర పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
(2 / 8)
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటీవలనే ఎన్నికల సంఘం షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా… నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 10వరకు గడువు ఉంటుంది.
(3 / 8)
నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న, ఉపసంహరణకు ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికలను ఫిబ్రవరి 27న నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది. మార్చి 8లోగా ఎన్నికలు పూర్తి చేస్తారు.
(4 / 8)
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రాడ్యుయేట్లు, టీచర్లు వారి ఓటు స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
(5 / 8)
గ్రాడ్యూయేట్ లేదా టీచర్ ఓటు కోసం నమోదు చేసుకున్న వారు ఏపీ ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపేంచే ఏపీ ఎమ్మెల్సీ ఈ- రిజిస్ట్రేషన్ 2024పై క్లిక్ చేయాలి.
(6 / 8)
'Track Your MLC Application Status' పై నొక్కగానే మరో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గ్రాడ్యుయేటా..? లేదా టీచర్ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
(7 / 8)
ఆ తర్వాత అప్లికేషన్ ఐడీ లేదా దరఖాస్తుదారుడి పేరు లేదా ఇంటి నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ పై నొక్కాలి. వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మీ దరఖాస్తు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించవచ్చు.
(8 / 8)
ఈ లింక్ పై క్లిక్ చేసి మీ ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు