TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల ఫైనల్ లిస్టును ఎలా రూపొందిస్తారు..? వీటిని తెలుసుకోండి-do you know how the beneficiaries selected for indiramma houses scheme in telangana latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల ఫైనల్ లిస్టును ఎలా రూపొందిస్తారు..? వీటిని తెలుసుకోండి

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల ఫైనల్ లిస్టును ఎలా రూపొందిస్తారు..? వీటిని తెలుసుకోండి

Jan 05, 2025, 06:04 AM IST Maheshwaram Mahendra Chary
Jan 05, 2025, 06:04 AM , IST

  • TG Indiramma Housing Scheme Updates: తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 75 శాతానిపైగా సర్వే శాతం పూర్తయింది. సంక్రాంతిలోపే మొత్తం సర్వే పూర్తి చేసి.. ఆ తర్వాత అర్హుల జాబితాలను ప్రకటించనున్నారు. అయితే ఏ విధంగా అర్హుల జాబితాను రూపొందిస్తారో ఇక్కడ తెలుసుకోండి....

 తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు ఈ సర్వే 75 శాతానిపైగా పూర్తి అయింది. కొన్ని జిల్లాల్లో 90 నుంచి 100 శాతం మధ్య సర్వే పూర్తి కాగా.. పట్టణ ప్రాంతాల్లో నెమ్మదిగా సాగుతోంది.  

(1 / 9)

ఈ సంక్రాంతి లోపే ఇందిమ్మ ఇళ్ల సర్వే మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.  క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు… ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిదీ యాప్ లో ఎంట్రీ.. ఫొటోలను కూడా అప్ లోడ్ చేస్తున్నారు. 

(2 / 9)

గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది. 

(3 / 9)

సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  అయితే తుది జాబితాల రూపకల్పనలో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా పని చేయనున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాలు, వార్డుల్లో ఈ కమిటీలు కొలువుదీరాయి. 

(4 / 9)

సర్వే వివరాలతో పాటు ఇందిర్మ కమిటీల సాయంతో గ్రామసభ ద్వారా లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తారు. ఈ  జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. 

(5 / 9)

 కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు ఈ లిస్ట్ చేరాల్సి ఉంటడుంది.  జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు… దశల వారీగా జమవుతాయి. మొత్తం 4 విడతల్లో ఈ డబ్బులు అందుతాయి. 

(6 / 9)

 తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పింది. ఈ క్రమంలో.. ఈ విడతలో ఖాళీ జాగా ఉన్న వారికే అత్యధికంగా స్కీమ్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. 

(7 / 9)

మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. లక్షలాది దరఖాస్తులు రావటంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాల్ గా మారింది.  

(8 / 9)

ఈ కొత్త ఏడాదిలోనే ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం షురూ కానుంది. అంతేకాకుండా… త్వరలోనే ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ తో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ ను అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని ఏ మారుమూల తండా, లేదా గ్రామం నుంచైనా ఫిర్యాదు చేస్తే త‌క్ష‌ణం స్పందించి చ‌ర్య‌లు తీసుకునేలా ఈ వ్యవస్థను తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తంది.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు