తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Survey : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - సర్వే కోసం దరఖాస్తులను ఎలా ఎంపిక చేస్తున్నారో తెలుసా..?
- TG Indiramma Housing Survey Applications: తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి సర్వే కొనసాగుతోంది. సంక్రాంతిలోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజాపాలనలో స్వీకరించి ఆన్ లైన్ చేసిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటి ఆధారంగానే సర్వే జరగుతోంది. ముఖ్య విషయాలు ఇక్కడ తెలుసుకోండి…
- TG Indiramma Housing Survey Applications: తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి సర్వే కొనసాగుతోంది. సంక్రాంతిలోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజాపాలనలో స్వీకరించి ఆన్ లైన్ చేసిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటి ఆధారంగానే సర్వే జరగుతోంది. ముఖ్య విషయాలు ఇక్కడ తెలుసుకోండి…
(1 / 9)
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 50 శాతానికి పైగా సర్వే పూర్తైంది. సంక్రాంతిలోపు దాదాపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. సాంకేతిక ఇబ్బందులతో నెమ్మదిగా నడుస్తున్నప్పటికీ… సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.
(2 / 9)
గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. అయితే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి.
(3 / 9)
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను అప్పట్లోనే ఆన్ లైన్ చేశారు. అయితే ఈ వివరాల ఆధారంగానే ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి సర్వే కొనసాగుతోంది.
(4 / 9)
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న సమయంలో రశీద్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఆధారంగా దరఖాస్తుదారుడి స్టేటస్ తెలుస్తోంది. ఇలా కాకుండా… దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ ద్వారా కూడా వివరాలు కనిపిస్తాయి.
(5 / 9)
ప్రస్తుతం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం దరఖాస్తుదారుడి రశీద్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేస్తే వివరాలు డిస్ ప్లే అవుతున్నాయి. యాప్ లో పేరు కనిపిస్తేనే… సర్వేను నిర్వహిస్తున్నారు. అలాంటి దరఖాస్తుదారుడి వివరాలను సేకరించి… ఫొటోలను అప్ లోడ్ చేస్తున్నారు.
(6 / 9)
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్ లైన్ కానివారి వివరాలను యాప్ లో కనిపించటం లేదు. ఇలాంటి వారు మండల కేంద్రాల్లోని స్పెషల్ గ్రీవెన్స్ సెల్ లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
(7 / 9)
ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే అప్లికేషన్లను స్వీకరించి.. ఆన్ లైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారికి కూడా సర్వే నిర్వహిస్తారు. ఒక వేళ ఈ విడతలో మిస్ అయినప్పటికీ.. మరో విడత సర్వేలో వివరాలను సేకరించే అవకాశం ఉంటుంది.
(8 / 9)
ప్రస్తుతం జరుగుతున్న సర్వే జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తి తర్వాత… లబ్ధిదారుల జాబితాను ఎలా ఎంపిక చేస్తారనేది అందరిలోనూ ఆసక్తిని పుట్టిస్తోంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటంతో.. అర్హత కలిగిన వారిని గుర్తించటం సవాల్ గా మారిపోయింది. అయితే గ్రామ సభ ఆమోదం తర్వాతనే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఈ పేర్లకే జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం.
(9 / 9)
ఇక ఈ మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు.. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేస్తారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
ఇతర గ్యాలరీలు