Vizag Colony Trip : సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - మధ్యలో అద్భుతమైన ఐల్యాండ్..! ఈ టూరిస్ట్ స్పాట్ తప్పక చూడాల్సిందే
- Vizag Colony Tourism Spot : వైజాగ్ కాలనీ… హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది. దీనికితోడూ నీళ్ల మధ్యలో ఐల్యాండ్ ఉంటుంది. ఈ టూరిస్ట్ స్పాట్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి…..
- Vizag Colony Tourism Spot : వైజాగ్ కాలనీ… హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది. దీనికితోడూ నీళ్ల మధ్యలో ఐల్యాండ్ ఉంటుంది. ఈ టూరిస్ట్ స్పాట్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి…..
(1 / 14)
నాగార్జున సాగర్ అందరికీ తెలుసు..! అదే దారిలో మరో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది. అదే వైజాగ్ కాలనీ. ఈ ప్లేస్ హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. చుట్టూ కొండలు, కనుచూపుమేర కనిపించే పచ్చని ప్రకృతి అందాలు దర్శనమిస్తుంటాయి.
(image source HT Telugu)(2 / 14)
ఈ అద్భుతమైన ప్లేస్ విశేషాలను తెలుసుకునేందుకు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు(HT Telugu) టీమ్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. పచ్చని ప్రకృతి అందాల మధ్య సాగిన ప్రయాణంలో కొన్ని చిత్రాలను సేకరించింది.
(image source HT Telugu)(3 / 14)
ఈ వైజాగ్ కాలనీ స్పాట్ హైదరాబాద్ నగరం నుంచి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు అత్యంత దగ్గర్లో ఈ ప్లేస్ ఉంది.
(image source HT Telugu)(4 / 14)
ప్రస్తుతం నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతం పరిధిలో వైజాగ్ కాలనీ ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు కుడి వైపున ఉంటుంది. గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భుతమని చెప్పొచ్చు.
(image source HT Telugu)(5 / 14)
ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సాగర్ హైవేపై ఉండే మల్లెపల్లి చౌరస్తా దాటిన తర్వాత కుడి వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా… దేవరకొండ టౌన్ కు చేరుకొని కూడా మరో రూట్ లో వెళ్లొచ్చు. ఈ రెండు రూట్లలో రోడ్డు సౌకర్యం చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జర్నీ సాగుతుంది.
(image source HT Telugu)(6 / 14)
పెద్ద మునిగల్, చిన్నమునిగల్ దాటగానే వైజాగ్ కాలనీ స్పాట్ ఉంటుంది. చుట్టూ భారీ కొండలు, ఎటూ చూసిన పచ్చని ప్రకృతి ఉంటుంది. స్పాట్ కు చేరుకోగానే… చాలా బోట్లు ఉంటాయి.
(image source HT Telugu)(7 / 14)
చుట్టు నీరు ఉండగా.. మధ్యలో ఓ ఐల్యాండ్ ఉంటుంది. అక్కడి వరకు బోటులో వెళ్లొచ్చు. బోట్ జర్నీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
(image source HT Telugu)(8 / 14)
ఐల్యాండ్ మధ్యలో నిలబడి చూస్తే సాగర్ బ్యాక్ వాటర్ అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. మాటల్లో వర్ణించలేనంత అనుభూతిని కలిగిస్తాయి.
(image source HT Telugu)(9 / 14)
బోటులో ఐల్యాండ్ కు వెళ్లిన తర్వాత కాసేపు అక్కడ గడపవచ్చు. చాలా మంది అక్కడ భోజనాలు చేస్తుంటారు. తిరిగి ఐల్యాండ్ వెనక భాగం నుంచి గమ్యస్థానానికి వెళ్తారు.
(image source HT Telugu)(11 / 14)
వైజాగ్ కాలనీలో సీ పుడ్ తప్పక తినాల్సిందే. ఆర్డర్ ఇస్తే ఇక్కడ వండి ఇస్తారు. ధరలు మరీ ఎక్కువ కాకుండా తక్కువగానే ఉంటాయి.
(image source HT Telugu)(12 / 14)
(13 / 14)
విశాఖ జిల్లా నుంచి వచ్చిన మత్స్యకారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అందుకే దీనికి వైజాగ్ కాలనీ అని పేరు వచ్చిందని స్థానికులు చెప్పారు. చేపల వ్యాపారం చేసే ఓ మహిళను HT తెలుగు సంప్రదించగా వివరాలను తెలిపింది. “ చేపల వ్యాపారం చేస్తుంటాం. చాలా ఏళ్ల కిందట మా పూర్వీకులు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్, కోల్ కత్తాతో పాటు అనేక పట్టణాలకు చేపలను ఎగుమతి చేస్తుంటాం. చేపల వేటనే మా జీవనాధారం, మేం పూర్తిగా ఇక్కడే సెట్ అయ్యాం. దాదాపు 300 నుంచి 400 ఇళ్లు ఉంటాయి.” అని చెప్పింది.
(image source HT Telugu)ఇతర గ్యాలరీలు