(1 / 5)
కౌజు పిట్టలు చిన్న పక్షులు. ఇవి త్వరగా పెరుగుతాయి. అలాగే ఎక్కువ గుడ్లు పెడతాయి. వీటిని అతి తక్కువ స్థలంలో పెంచవచ్చు. అధిక లాభాలు పొందవచ్చు. దీంతో చాలామంది వీటి పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు.
(2 / 5)
కౌజు పిట్టలను 5 వారాలకే అమ్మేయవచ్చు. ఒక కోడిపిల్లను పెంచే స్థలంలో 8 నుంచి 10 కౌజు పిట్టలను పెంచవచ్చు. 200 గ్రాముల బరువు ఉండే కౌజు పిట్టలను రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తారు.
(3 / 5)
ఒక్కో కౌజు పిట్ట ఏడాదికి 200 నుంచి 300 గుడ్లు పెడుతుంది. వీటిని కృత్రిమంగా పొదగడానికి ఇంక్యుబేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెంచే గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి, నేరుగా సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
(4 / 5)
వీటివి కేజేస్‌లో కూడా పెంచవచ్చు. ఒక్కో దాంట్లో 10 పక్షుల వరకు పెరుగుతాయి. ప్రత్యుత్పత్తి కోసం.. రెండు ఆడ పక్షుల కోసం.. ఒక మగ పక్షిని ఉంచాలి. ఇవి గుడ్లు పెట్టడానికి వేడి కంటే.. వెలుతురు ముఖ్యం.
(5 / 5)
రోజుకు 14 నుంచి 16 గంటలు లైట్లు ఉండేలా చూసుకోవాలి. వీటి మేతలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో దొరికే కోళ్ల దానా వీటికి వేయొద్దు. మొక్కజొన్న పొడి, వరి తవుడు, సోయాబీన్స్, వేరు శనగ చెక్కలను వీటికి మేతగా వేయాసి.
ఇతర గ్యాలరీలు