Water Drinking Tips: నీరు ఇలా తాగితే ఇబ్బందులు! సరైన తీరు ఏదంటే..
Health Tips: తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే, సరైన రీతిలో తాగాలి. ఆయుర్వేదం ప్రకారం నీరు ఎలా తాగితే ఇబ్బందులు వస్తాయో ఇక్కడ చూడండి.
(1 / 8)
ప్రతీ రోజు అందరూ సరిపడా నీరు తాగాలి. దీని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, నీరు సరైన పద్ధతిలో తాగకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. నడుస్తూ, నిలబడి నీరు తాగడం మీరు గమనిస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా ఇలా చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి.
(2 / 8)
ఆయుర్వేద నిపుణుల ప్రకారం నిలబడి, నడుస్తున్నప్పుడు లేకపోతే పడుకున్నప్పుడు నీరు తాగడం మంచిది కాదు. ఇలా నీరు తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
(3 / 8)
నిలబడి నీరు తాగడం వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడి శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బ తింటుందని ఆయుర్వేదం చెబుతోంది. దీంతో నిల్చొని నీరు తాగితే మోకాళ్ల నొప్పులు. అజీర్ణం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయట.
(4 / 8)
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీరు తాగడం వల్ల అర్థరైటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది. కీళ్ల నొప్పుల సమస్య కూడా అధికమయ్యే ఛాన్స్ ఉంటుంది.
(5 / 8)
ఆయుర్వేదం ప్రకారం, నిలబడి లేకపోతే పడుకొని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. దీని వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవొచ్చు.
(6 / 8)
శరీరాన్ని హైట్రేడెట్‍గా ఉంచడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే, నిలబడి తాగితే.. నీరు త్వరగా కడుపు కింది భాగానికి చేరుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందిగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
(7 / 8)
నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు కూడా ప్రభావితం అవుతాయి. ఇది ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు