జుట్టు రాలుతోందా, తెల్లబడుతోందా? ఇంట్లోనే దీనికి విరుగుడు-diy hair oil for hair fall stop hair loss and promote healthy hair growth with this easy recipe ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Diy Hair Oil For Hair Fall Stop Hair Loss And Promote Healthy Hair Growth With This Easy Recipe

జుట్టు రాలుతోందా, తెల్లబడుతోందా? ఇంట్లోనే దీనికి విరుగుడు

Jul 04, 2023, 09:47 AM IST HT Telugu Desk
Jul 04, 2023, 09:47 AM , IST

జుట్టు రాలిపోవడం ఎక్కువైతే కొబ్బరినూనెలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలపండి. ఇంట్లోనే ఈ మిశ్రమాన్ని తయారు చేయండి. నెల రోజులు వాడితే మీకు ఫలితం కనిపిస్తుంది.

వర్షాకాలంలో వెంట్రుకలు రాలిపోవడం వల్ల స్త్రీ, పురుషులు ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు వంటింటి చిట్కాలు ఉపయోగించవచ్చు. నూనెతో తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల మీ జుట్టు బలంగా మారుతుంది. 

(1 / 5)

వర్షాకాలంలో వెంట్రుకలు రాలిపోవడం వల్ల స్త్రీ, పురుషులు ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు వంటింటి చిట్కాలు ఉపయోగించవచ్చు. నూనెతో తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల మీ జుట్టు బలంగా మారుతుంది. (Freepik)

కరివేపాకులో విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇది జుట్టుకు అద్భుతమైన పోషకాహారం అని నిరూపితమైంది.. 1 కప్పు కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయండి. దానికి అర చేతిలో పట్టేంత కరివేపాకు కలపండి. ఇప్పుడు నూనె నల్లగా మారే వరకు వేడి చేయాలి. ఇప్పుడు దీన్ని వడకట్టి, చల్లగా ఉన్నప్పుడు డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

(2 / 5)

మరిన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు ఈ నూనెలో మందార పువ్వుల పేస్ట్‌ను కూడా కలపొచ్చు. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడం లేదా తెల్ల జుట్టు రావడంతో బాధపడుతున్న వారికి ఈ నూనె ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. 

(3 / 5)

జుట్టు సంరక్షణలో మెంతులు ఉపయోగకరమైన పదార్ధం. కొత్త వెంట్రుకలు పెరగడంలో ఈ గింజ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. మెంతికూరలో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు ఉంటాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కొబ్బరి నూనెలో కరివేపాకు, మందార పువ్వులతో పాటు అరకప్పు మెంతులు వేయవచ్చు. 

(4 / 5)

చాలా మంది రాత్రి పడుకునే ముందు నూనె రాసుకుంటారు. దీనికి బదులుగా, తలస్నానం చేయడానికి 3-4 గంటల ముందు తలకు నూనె రాయండి. చేతులతో సున్నితంగా మసాజ్ చేయండి. జుట్టుకు ఎక్కువ నూనె రాయాల్సిన అవసరం లేదు. మీ చేతిలోని నూనెను మీ జుట్టు అంతటా బాగా రుద్దండి. షాంపూ చేయడానికి ముందు మీరు మీ తలపై వేడి టవల్‌ను చుట్టవచ్చు. ఇలా జుట్టుకు నూనె రాస్తే మృదువుగా ఉండి జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు