(1 / 6)
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూళ్లకు దసరా హాలీ డేస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే నెలలో దీపావళి కూడా వస్తుండటంతో మరోసారి విద్యార్థులకు సెలవులు రానున్నాయి.
(image source from https://unsplash.com/)(2 / 6)
దీపావళి వస్తే చాలు ఊరూ వాడా బాణాసంచాలతో మోత మోగిపోతుంది. ఇంటింటా వేడుక వాతావరణం ఉంటుంది. ఈసారి దీపావళి పండగ ఏ రోజు అనే విష.యంలో సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వేర్వురు తేదీల్లో సెలవులు ప్రకటించారు.
(image source from https://unsplash.com/)(3 / 6)
ఆంధ్రప్రదేశ్ లో చూస్తే విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీన దీపావళి సెలవును ప్రకటించారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇక తెలంగాణలో కూడా అక్టోబర్ 31వ తేదీనే దీపావళి హాలీ డే గా నిర్ణయించారు. అయితే దీపావళికి ముందు రోజు ఏమైనా సెలవు ఇస్తారా..? లేక నవంబర్ 1న సెలవు ఉంటుందా అనే దానిపై క్లారిటీ లేదు.
(image source from https://unsplash.com/)(4 / 6)
అయితే తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 31వ తేదీ మాత్రమే కాకుండా నవంబర్ 1న కూడా సెలవు ఇచ్చారు. ఆ తర్వాత శనివారం, ఆదివారం వస్తున్నాయి. ఈ రెండు రోజులు కూడా సెలవు ఉండటంతో… ఆయా రాష్ట్రాల్లో మొత్తం నాలుగు రోజుల పాటు దీపావళి సెలవులు వస్తున్నాయి.
(image source from https://unsplash.com/)(5 / 6)
తమిళనాడు ప్రభుత్వ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా నవంబర్ 1వ తేదీన సెలవు ప్రకటిస్తే… మరోసారి విద్యార్థులకు వరుస సెలవులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇరు ప్రభుత్వాల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
(image source from https://unsplash.com/)(6 / 6)
దీపావళికి పండగ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నవంబరు 1, 2 తేదీల్లో సెలవు ప్రకటించింది. ఇక కేరళలోని సర్కార్ నవంబర్ 1న హాలీ డే ఇచ్చింది. అస్సాం, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాలు… అక్టోబరు 31 నుంచి నవంబరు 02 వరకూ సెలవులు ఇచ్చాయి.
(image source from https://unsplash.com/)ఇతర గ్యాలరీలు