(1 / 7)
బాలీవుడ్‍లో దీపావళి సందడి మొదలైంది. వచ్చే వారం పండుగ ఉండగా.. బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఇప్పుడే దివాళీ పార్టీ ఇచ్చారు పాపులర్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా. ఈ పార్టీలో గ్లామరస్‍గా మెరిశారు సినీ స్టార్లు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. పింక్ లెహెంగాలో మరింత అందంగా కనిపించారు.
(2 / 7)
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చీరలో తళుక్కుమన్నారు. బ్యూటిఫుల్ శారీ లుక్‍లో మరింత అందంగా మెరిశారు. ఇటీవలే దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఈ బ్యూటీ.
(3 / 7)
స్టార్ హీరోయిన్ తమన్నా పింక్ కలర్ ఔట్‍ఫిట్‍లో అదరగొట్టారు. సీనియర్ నటి కాజోల్.. రెడ్ షిమ్మరీ కోఆర్డ్ సెట్ డ్రెస్ ధరించారు.
(4 / 7)
ప్లోరల్ డిజైన్ ఉన్న పింక్ కలర్ చీరలో కుషా కపిల హొయలు ఒలికించారు.
(5 / 7)
సుహానా ఖాన్, అనన్య పాండే చీరలో మెరిశారు. సుహాన్ రెడ్ కలర్ శారీ వేసుకోగా.. వైట్ కలర్ చీరలో అనన్య అల్ట్రా గ్లామరస్‍గా కనిపించారు.
(6 / 7)
కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు మ్యాచింగ్ ఔట్‍ఫిట్‍లో వారెవా అనిపించారు. షాహిద్ కపూర్, మిరా రాజ్‍పుత్ జంట కూడా ఈ పార్టీలో మెరిశారు.
(7 / 7)
గౌరీ ఖాన్, ఖుషి కపూర్ బ్లాక్ కలర్ చీర ధరించారు. ఖుషి శారీ విభిన్నమైన డిజైన్‍తో ట్రెండీగా ఉంది.
ఇతర గ్యాలరీలు