Diwali Date 2024 : ఈ ఏడాది దీపావళి ఏ తేదీన జరుపుకోవాలి? పూజ సమయం ఏది?-diwali 2024 date when is deepavali celebrated 31st october or 1st november know auspicious time for laxmi puja ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diwali Date 2024 : ఈ ఏడాది దీపావళి ఏ తేదీన జరుపుకోవాలి? పూజ సమయం ఏది?

Diwali Date 2024 : ఈ ఏడాది దీపావళి ఏ తేదీన జరుపుకోవాలి? పూజ సమయం ఏది?

Oct 22, 2024, 04:27 PM IST Anand Sai
Oct 22, 2024, 04:27 PM , IST

  • Diwali Date 2024 : దీపాల పండుగ దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకొంటాం. ఈ దీపావళి పండుగ దేశమంతటా ఉంటుంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 31న దీపావళి జరుపుకోవాలా? నవంబర్ 1న జరుపుకోవాలా అని చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు

ఈ ఏడాది దీపావళి అక్టోబరు 31 అని కొందరు, నవంబర్ 1న దీపావళి అని మరికొందరు అంటున్నారు. అయితే పంచాంగ ప్రకారం దీపావళి జరుపుకోవడానికి కచ్చితమైన రోజు ఏమిటో చూద్దాం.

(1 / 4)

ఈ ఏడాది దీపావళి అక్టోబరు 31 అని కొందరు, నవంబర్ 1న దీపావళి అని మరికొందరు అంటున్నారు. అయితే పంచాంగ ప్రకారం దీపావళి జరుపుకోవడానికి కచ్చితమైన రోజు ఏమిటో చూద్దాం.

కార్తీక మాసంలో అమావాస్య నాడు దీపావళి జరుపుకొంటారు. ఈ రోజున దీపావళి ప్రదోష సమయం నుండి అర్ధరాత్రి వరకు నిర్వహించుకోవచ్చు. నిశిత కాలం లక్ష్మీపూజకు అనుకూలమని చెబుతారు.

(2 / 4)

కార్తీక మాసంలో అమావాస్య నాడు దీపావళి జరుపుకొంటారు. ఈ రోజున దీపావళి ప్రదోష సమయం నుండి అర్ధరాత్రి వరకు నిర్వహించుకోవచ్చు. నిశిత కాలం లక్ష్మీపూజకు అనుకూలమని చెబుతారు.(PTI)

ఈ సంవత్సరం అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:11 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 05:12 వరకు కొనసాగుతుంది. కాబట్టి అక్టోబర్ 31న దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారు. అక్టోబరు 31న లక్ష్మీపూజ చేయవచ్చని కూడా కొందరు అంటున్నారు. మీరు అక్టోబర్ 31న మధ్యాహ్నం 03:25 గంటల తర్వాత లక్ష్మీ పూజ కోసం సిద్ధం చేసుకోవచ్చు.

(3 / 4)

అక్టోబరు 31న లక్ష్మీపూజ చేయడానికి అనుకూలమైన సమయం సాయంత్రం 05:36 నుండి రాత్రి 08:11 వరకు. మీరు నిషిత సమయంలో పూజ చేయాలనుకుంటే 11:39 నుండి 12:31 వరకు ఉంటాయి.

(4 / 4)

అక్టోబరు 31న లక్ష్మీపూజ చేయడానికి అనుకూలమైన సమయం సాయంత్రం 05:36 నుండి రాత్రి 08:11 వరకు. మీరు నిషిత సమయంలో పూజ చేయాలనుకుంటే 11:39 నుండి 12:31 వరకు ఉంటాయి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు