Bhagyashri Borse: కథ చెప్పకుండానే నమ్మమన్నారు: మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ
- Bhagyashri Borse: రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో ఆమె అడుగుపెడుతున్నారు. అయితే, ఈ సినిమా స్టోరీని ముందుగా తనకు డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ వెల్లడించారు.

(1 / 5)
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. హరీశ్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రమోషన్లలో భాగంగా రవితేజ, భాగ్యశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
(2 / 5)
మిస్టర్ బచ్చన్ స్టోరీ వినగానే ఎలా అనిపించిందని భాగ్యశ్రీని ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు యాంకర్ సుమ. అయితే, అసలు తనకు డైరెక్టర్ హరీశ్ శంకర్ కథే చెప్పలేదని భాగ్యశ్రీ చెప్పారు. దీంతో సుమ ఆశ్చర్యపోయారు.
(3 / 5)
తన పాత్ర గురించి హరీశ్ శంకర్ చెప్పారని, అయితే సినిమా స్టోరీని నరేట్ చేయలేదని భాగ్యశ్రీ తెలిపారు. తనను పూర్తిగా నమ్మాలని హరీశ్ భరోసా ఇచ్చారని వెల్లడించారు. ఆయన కళ్లలో సినిమా పట్ల ప్యాషన్ చూసి తాను కూడా కథ పూర్తిగా వినకుండానే మిస్టర్ బచ్చన్ మూవీకి ఓకే చెప్పేశానని భాగ్యశ్రీ తెలిపారు.
(4 / 5)
మిస్టర్ బచ్చన్ సినిమాకు అంగీకరించి తాను అద్భుతమైన నిర్ణయం తీసుకున్నానని ఇప్పుడు అనిపిస్తోందని భాగ్యశ్రీ అన్నారు. ఈ కథ ముందే వినాల్సిందని షూటింగ్ సమయంలో తనకు ఎప్పుడూ అనిపించలేదని చెప్పారు. ఈ మూవీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇతర గ్యాలరీలు