Suriya: సూర్య అలా చేస్తాడని నేనెప్పుడు అనుకోలేదు, చాలా బాధగా ఉంది, ఏమాత్రం తీసుకోలేకపోతున్నా.. డైరెక్టర్ గౌతమ్ మీనన్-director gautham vasudev menon upset with suriya rejecting dhruva nakshatram movie to act and says i can not take it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suriya: సూర్య అలా చేస్తాడని నేనెప్పుడు అనుకోలేదు, చాలా బాధగా ఉంది, ఏమాత్రం తీసుకోలేకపోతున్నా.. డైరెక్టర్ గౌతమ్ మీనన్

Suriya: సూర్య అలా చేస్తాడని నేనెప్పుడు అనుకోలేదు, చాలా బాధగా ఉంది, ఏమాత్రం తీసుకోలేకపోతున్నా.. డైరెక్టర్ గౌతమ్ మీనన్

Jan 19, 2025, 07:25 AM IST Sanjiv Kumar
Jan 19, 2025, 07:25 AM , IST

Gautham Vasudev Menon Upset With Suriya: తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన కాఖా కాఖా (తెలుగులో ఘర్షణ), వారణం ఆయిరం (సూర్య సన్ ఆఫ్ కృష్ణన్) బ్లాక్ బస్టర్ హిట్స్. అయితే, సూర్య చేసిన ఓ పనికి గౌతమ్ మీనన్ చాలా బాధపడినట్లు తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

ధృవ నక్షత్రం సినిమాలో తనకు, సూర్యకు మధ్య జరిగిన సమస్యల గురించి గౌతమ్ వాసుదేవ్ మీనన్ బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు.“నేను నా తోటి నటులతో తిరిగి కనెక్ట్ కావడం గురించి మాట్లాడినప్పుడు, నేను ఎల్లప్పుడూ అరుస్తున్నాడని ప్రజలు అనుకుంటారు” అని గౌతమ్ మీనన్ అన్నారు.  

(1 / 6)

ధృవ నక్షత్రం సినిమాలో తనకు, సూర్యకు మధ్య జరిగిన సమస్యల గురించి గౌతమ్ వాసుదేవ్ మీనన్ బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు.

“నేను నా తోటి నటులతో తిరిగి కనెక్ట్ కావడం గురించి మాట్లాడినప్పుడు, నేను ఎల్లప్పుడూ అరుస్తున్నాడని ప్రజలు అనుకుంటారు” అని గౌతమ్ మీనన్ అన్నారు.

"నేను అడిగిన సమయంలో వారు ఓకే చెప్పలేకపోవచ్చు, కానీ, నిజం చెప్పాలంటే, నేను దానిని అర్థం చేసుకోలేకపోతున్నాను" అని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలిపారు.  

(2 / 6)

"నేను అడిగిన సమయంలో వారు ఓకే చెప్పలేకపోవచ్చు, కానీ, నిజం చెప్పాలంటే, నేను దానిని అర్థం చేసుకోలేకపోతున్నాను" అని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలిపారు. 

"కాఖా కాఖా తెలుగులో (ఘర్షణ), వారణం ఆయిరం (సూర్య సన్ ఆఫ్ కృష్ణన్) తరహాలో ధృవ నక్షత్రం రూపొందింది. కాబట్టి ధృవ నక్షత్రం సినిమాకు సూర్య నో చెప్పి ఉండాల్సింది కాదని నా అభిప్రాయం" అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ వెల్లడించారు.  

(3 / 6)

"వారణం ఆయిరం సినిమాలో తండ్రి పాత్ర కోసం నానా పటేకర్, మోహన్ లాల్ లను అడిగాను. కానీ, వారు చేయలేకపోయారు. ఆ సమయంలో సూర్య ధైర్యంగా తండ్రి పాత్ర చేస్తానని చెప్పాడు" అని గౌతమ్ మీనన్ అన్నారు.

(4 / 6)

"వారణం ఆయిరం సినిమాలో తండ్రి పాత్ర కోసం నానా పటేకర్, మోహన్ లాల్ లను అడిగాను. కానీ, వారు చేయలేకపోయారు. ఆ సమయంలో సూర్య ధైర్యంగా తండ్రి పాత్ర చేస్తానని చెప్పాడు" అని గౌతమ్ మీనన్ అన్నారు.

“ధృవ నక్షత్రం సినిమా సూర్యకు అర్థం కాలేదు. ఈ సినిమా గురించి చాలా డిస్కషన్ జరిగింది. ఈ సినిమాకి రిఫరెన్స్ పాయింట్స్ అడిగారు. దాని గురించి నేను మాట్లాడలేదు. మీరు వస్తే డిఫరెంట్‌గా సినిమా చేస్తాను. యాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పాను. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ఆ సినిమా జరగలేదు” అని గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు.   

(5 / 6)

"నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే కాఖా కాఖా, వారణం ఆయిరం అనే రెండు మంచి సినిమాలు ఇచ్చిన దర్శకుడిని ఆయన నన్ను నమ్మలేదు. నా కోసం చేయమని కూడా అడగలేదు. ఆ సినిమాను నేనే నిర్మించాను. ఆసినిమాకి నేనే దర్శకత్వం వహించబోతున్నాను. ఆ సినిమాకు నష్టం వచ్చినా అది నా దగ్గరకు వస్తుంది. ఆయనకు ఎలాంటి రిస్క్ లేదు. సినిమా ఫెయిల్ అయితే అది నాకు పెద్ద నష్టం. మరెవరైనా ఇలా చేసి ఉంటే ఒప్పుకునేవాడిని. కానీ, సూర్య అలా చేశాడు. అదే నేను తీసుకోలేకపోతున్నాను" అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన బాధను చెప్పుకున్నారు.  

(6 / 6)

"నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే కాఖా కాఖా, వారణం ఆయిరం అనే రెండు మంచి సినిమాలు ఇచ్చిన దర్శకుడిని ఆయన నన్ను నమ్మలేదు. నా కోసం చేయమని కూడా అడగలేదు. ఆ సినిమాను నేనే నిర్మించాను. ఆ

సినిమాకి నేనే దర్శకత్వం వహించబోతున్నాను. ఆ సినిమాకు నష్టం వచ్చినా అది నా దగ్గరకు వస్తుంది. ఆయనకు ఎలాంటి రిస్క్ లేదు. సినిమా ఫెయిల్ అయితే అది నాకు పెద్ద నష్టం. మరెవరైనా ఇలా చేసి ఉంటే ఒప్పుకునేవాడిని. కానీ, సూర్య అలా చేశాడు. అదే నేను తీసుకోలేకపోతున్నాను" అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన బాధను చెప్పుకున్నారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు