AP New Liquor Shops : ఏపీలో 3396 కొత్త లిక్కర్ షాపులు - డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి..!-digital payments are available at every liquor shop in andhrapradesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap New Liquor Shops : ఏపీలో 3396 కొత్త లిక్కర్ షాపులు - డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి..!

AP New Liquor Shops : ఏపీలో 3396 కొత్త లిక్కర్ షాపులు - డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి..!

Oct 16, 2024, 12:00 PM IST Maheshwaram Mahendra Chary
Oct 16, 2024, 12:00 PM , IST

  • AP New Liquor Shops : ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభమయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత పాత బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఏపీలో కొత్త మద్యం పాలసీ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం షాపులు లేకుండా… రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు కేటాయించింది.

(1 / 7)

రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.  లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. దీంతో స్టాక్ వీలైనంత త్వరగా లిక్కర్ దుకాణాలకు చేరనుంది. 

(2 / 7)

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మద్యం షాపులో డిజిటల్ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. గత ఐదేళ్లు మద్యం దుకాణాలను సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో లేవు.

(3 / 7)

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక… ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త ఏర్పాటైన దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్లు ఉంటాయి.

(4 / 7)

కొత్త షాపులు రావటంతో ఇక ఏపీలో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి.దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. 

(5 / 7)

ఏపీలో కొత్తగా అమల్లోకి వచ్చిన లిక్కర్‌ పాలసీలో మద్యం విక్రయాలపై అదనంగా 2శాతం సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాదక ద్రవ్యాల నియంత్రణ, డి-అడిక్షన్ చర్యలు, పునరావాసం, కౌన్సెలింగ్ మొదలైన వాటి కోసం కేంద్రాలను తెరవడం మరియు నిర్వహించడం వంటి వాటికి నిధులు సమకూర్చడానికి మద్య విక్రయాలపై 2% సెస్ విధించాలని నిర్ణయించార. ప్రతి బాటిల్‌పై ఈ సెస్ వసూలు చేస్తారు.

(6 / 7)

ఇండియన్‌ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్, బీర్ ధరలపై 2% చొప్పున ఈ సెస్ వసూలు చేస్తారు. , వైన్, రెడీ టూ డ్రింక్‌ ఉత్పత్తులపై కూడా ఇవి వర్తిస్తాయని ఏపీ ఎక్సైజ్ శాఖ నుంచి గెజిట్ జారీ అయింది. ఏపీలో మొత్తం 3, 396 మద్యం దుకాణాలు అందుబాటులో ఉంటాయి. టం ద్వారా 1800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ వైన్ షాప్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేయనున్నాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు