Sanitary Pads: శానిటరీ ప్యాడ్లు మొదటిసారి మగవారి కోసమే తయారుచేశారని తెలుసా?-did you know that sanitary pads were first made for men ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sanitary Pads: శానిటరీ ప్యాడ్లు మొదటిసారి మగవారి కోసమే తయారుచేశారని తెలుసా?

Sanitary Pads: శానిటరీ ప్యాడ్లు మొదటిసారి మగవారి కోసమే తయారుచేశారని తెలుసా?

Published May 03, 2024 01:25 PM IST Haritha Chappa
Published May 03, 2024 01:25 PM IST

  • Sanitary Pads: శానిటరీ ప్యాడ్లను తొలిసారిగా మహిళల కోసం కాకుండా పురుషుల కోసమే తయారు చేశారు. మగవారు ఈ ప్యాడ్లను దేని కోసం ఉపయోగించే వారోతెలుసుకోండి. 

శానిటరీ ప్యాడ్స్ గురించి చర్చించేటప్పుడు చాలా మంది పురుషులు అసౌకర్యంగా ఫీలవుతారు. నిజానికి వీటిని తొలిగా తయారుచేసినది మగవారి కోసమే.  

(1 / 7)

శానిటరీ ప్యాడ్లు మహిళల జీవితాలతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. నెలసరి సమయంలో స్త్రీలు కచ్చితంగా ఈ ప్యాడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. 

(2 / 7)

ఒకప్పుడు దీన్ని పురుషులు వినియోగించేవారు.  ఫ్రాన్స్ లో దీన్ని పురుషులు ఉపయోగించే వస్తువుగా ఉండేది. అమెరికాలోని కొందరు మహిళా నర్సులు పీరియడ్స్ సమయంలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఫలితంగా ఈ ప్యాడ్లు మహిళలు వాడడం మొదలైంది. ఆ తర్వాత ఈ అలవాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 

(3 / 7)

అమెరికన్ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొదట ఈ శానిటరీ ప్యాడ్ ను తయారు చేశారు. దానిలో వాడిన పదార్థాన్ని కనిపెట్టినవాడు అతడే. 

(4 / 7)

 ఐరోపాలో యుద్ధం జరుగుతున్న కాలంలో ఫ్రెంచ్ సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపాతం అధికంగా జరిగింది. వారి రక్తపాతాన్ని ఆపడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ రక్తాన్ని పీల్చే పదార్థాన్ని కనిపెట్టి శానిటరీ ప్యాడ్ ను సృష్టించాడు. ఈ ప్యాడ్ కోసం మెటీరియల్ అమెరికా నుంచి ఫ్రాన్స్ కు వచ్చేది. గాయపడిన సైనికులకు ఈ ప్యాడ్ లను కట్టేవారు. 

(5 / 7)

ఆ తర్వాత ఆ సైనికులకు సేవలందించేందుకు పలువురు అమెరికన్ నర్సులు ఫ్రాన్స్ కు వచ్చారు. వారికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ ప్యాడ్ లనే వినియోగించడం మొదలుపెట్టారు. అమెరికా వెళుతూ ఈ ప్యాడ్ లను కూడా తీసుకువెళ్లారు. అలా మహిళలంతా వీటిని వాడడం మొదలుపెట్టారు.  

(6 / 7)

కానీ మొదట్లో ఈ ప్యాడ్లు పేద, మధ్యతరగతి మహిళలకు అందుబాటులో ఉండేవి కాదు. ఆ తర్వాత వీటిని భారీగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దీంతో  వాటి ధరలు తగ్గాయి. ఎప్పుడైతే మహిళలు నెలసరికి వినియోగించడం మొదలుపెట్టాక మగవారు వీటిని వాడడం మానేశారు. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు