డయాబెటిస్ ఉన్నా ఈ ఆహార అలవాట్లేనా? ఆయుర్వేదం ఎందుకు నిషేధించిందో తెలుసా?
- మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం చేటు చేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
- మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం చేటు చేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
మీకు డయాబెటిస్ ఉంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని రోజూ తింటే మధుమేహాన్ని ఇంకా పెంచుకున్నట్టే. వీటి గురించి ఆయుర్వేదం ఏమి చెబుతుందో తెలుసుకోండి.(Freepik)
(2 / 5)
అతిగా పెరుగు తినడం: చాలా మంది మధుమేహ రోగులు రోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు. మితంగా తినడం మంచిదే. అతిగా తింటే బరువు పెరుగుతారు. జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది. ఇది డయాబెటిస్‌కు ముప్పుగా పరిణిమిస్తుంది.(Freepik)
(3 / 5)
భారీ డిన్నర్: రాత్రిపూట ఆలస్యంగా తినడం, పొట్ట పగిలేలా భోజనం చేయడం చాలా మందికి ఉండే రెండు అలవాట్లు. ఇవి జీవక్రియ రేటును తగ్గిస్తాయి. కాలేయంపై ఒత్తిడి పడేలా చేస్తాయి. ఇది డయాబెటిక్ రోగుల్లో పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.(Freepik)
(4 / 5)
అతిగా తినడం: కొన్నిసార్లు ఆకలితో అతిగా తినడం మనం చేసే పొరపాటు. ఇది ఆహారం యొక్క స్వభావాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిని విపరీతంగా పెంచేస్తుంది. అందుకే మితాహారం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.(Freepik)
ఇతర గ్యాలరీలు