(1 / 5)
‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ మూవీ.. టైటిల్ నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 29న డెవిల్ సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో మంచి విజయం సాధించింది. అయితే, డెవిల్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
(2 / 5)
డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో నేడు (జనవరి 14) స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ వెర్షన్‍లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
(3 / 5)
థియేటర్లలో రిలీజైన 20 రోజలలోపే డెవిల్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటించారు.
(4 / 5)
మర్డరీ మిస్టరీ, ఆపరేషన్ టైగర్ హంట్ చుట్టూ డెవిల్ కథ నడుస్తుంది. బ్రిటీష్ పాలన నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ మూవీగా ఈ చిత్రం వచ్చింది. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు.
ఇతర గ్యాలరీలు