తెలుగు న్యూస్ / ఫోటో /
Tv Serial Actress: ప్రియుడిని పెళ్లి చేసుకున్నదేవత సీరియల్ నటి - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
దేవత ఫేమ్..తెలుగు సీరియల్ నటి మాన్సీ జోషి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు రాఘవ్‌ను పెళ్లిచేసుకున్నది. పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది.
(1 / 5)
చిరకాల ప్రియుడు రాఘవ్‌తో గురువారం ఏడడుగులు వేసింది మాన్సీ జోషి. పెళ్లి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
(2 / 5)
జంటగా ఓ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టామని, ఈ రోజు కోసం ఎన్నో అందమైన కలలు కన్నామంటూ మాన్సీ జోషి ఓ పోస్ట్ పెట్టింది.
(3 / 5)
గత ఏడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ ఫొటోలతో రాఘవ్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించి సర్‌ప్రైజ్ చేసింది.
(4 / 5)
దేవత సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నది మాన్సీ జోషి. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్‌లో సత్య పాత్రలో మాన్సీ జోషి నటించింది.
ఇతర గ్యాలరీలు