Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి-devara part 1 dashes the hopes of janhvi kapoor ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి

Sep 28, 2024, 08:51 AM IST Galeti Rajendra
Sep 28, 2024, 08:51 AM , IST

Devara Part 1: శ్రీదేవి వారసురాలిగా ఆరేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. కానీ ఈ అమ్మడికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ పడలేదు. దేవర పార్ట్-1పై ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకి నిరాశే ఎదురైంది.

కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన దేవర-1 శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది.

(1 / 8)

కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన దేవర-1 శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది.

దేవర-1లో జూనియర్ ఎన్టీఆర్ (వర)ని ప్రేమించే తంగమ్మ క్యారెక్టర్‌లో జాన్వీ కపూర్ నటించింది. కానీ ఆమె పాత్ర నిడివిని డైరెక్టర్ కొరటాల శివ చాలా పరిమితం చేసేశారు. కాసిన్ని సీన్లు, ఒక రొమాంటిక్ పాట అన్నట్లుగా జాన్వీ కపూర్‌ని సర్దేశారు.

(2 / 8)

దేవర-1లో జూనియర్ ఎన్టీఆర్ (వర)ని ప్రేమించే తంగమ్మ క్యారెక్టర్‌లో జాన్వీ కపూర్ నటించింది. కానీ ఆమె పాత్ర నిడివిని డైరెక్టర్ కొరటాల శివ చాలా పరిమితం చేసేశారు. కాసిన్ని సీన్లు, ఒక రొమాంటిక్ పాట అన్నట్లుగా జాన్వీ కపూర్‌ని సర్దేశారు.(Sunil Khandare)

జాన్వీ కపూర్ పూర్తి స్థాయి నటనని దేవర- 2లో చూస్తారని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కెమెరామెన్ రత్నవేలు కూడా అదే విషయం చాలా కాన్పిడెంట్‌గా చెప్పాడు. కానీ దేవర-2 రావాలంటే కనీసం మరో 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. 

(3 / 8)

జాన్వీ కపూర్ పూర్తి స్థాయి నటనని దేవర- 2లో చూస్తారని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కెమెరామెన్ రత్నవేలు కూడా అదే విషయం చాలా కాన్పిడెంట్‌గా చెప్పాడు. కానీ దేవర-2 రావాలంటే కనీసం మరో 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. (REUTERS)

దేవర-1 కలిసి రాకపోవడంతో జాన్వీ కపూర్ ఇక ఆశలు రామ్‌చరణ్‌‌తో చేస్తున్న ఆర్సీ 16పైనే ఉండనున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిట్ అయితేనే సౌత్‌లో జాన్వీకి అవకాశాలు పెరుగుతాయి. లేకపోతే మళ్లీ బాలీవుడ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. 

(4 / 8)

దేవర-1 కలిసి రాకపోవడంతో జాన్వీ కపూర్ ఇక ఆశలు రామ్‌చరణ్‌‌తో చేస్తున్న ఆర్సీ 16పైనే ఉండనున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిట్ అయితేనే సౌత్‌లో జాన్వీకి అవకాశాలు పెరుగుతాయి. లేకపోతే మళ్లీ బాలీవుడ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. (Instagram)

స్క్రీన్ అప్పీరియన్స్ విషయంలో జాన్వీ కపూర్‌ని వంక పెట్టడానికి లేదు. కానీ తంగ క్యారెక్టర్ విషయంలో దర్శకుడు కొరటాల శివ దేవర-1లో ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. దాంతో ఆమె గురించి సినిమా చూసిన వాళ్లు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. 

(5 / 8)

స్క్రీన్ అప్పీరియన్స్ విషయంలో జాన్వీ కపూర్‌ని వంక పెట్టడానికి లేదు. కానీ తంగ క్యారెక్టర్ విషయంలో దర్శకుడు కొరటాల శివ దేవర-1లో ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. దాంతో ఆమె గురించి సినిమా చూసిన వాళ్లు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. (Sunil Khandare)

దఢక్ సినిమాతో 2018లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ ఈ ఆరేళ్లలో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ సినిమా ఖాతాలో వేసుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో జాన్వీ యాక్టింగ్ బాగున్నా కూడా.. బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. 

(6 / 8)

దఢక్ సినిమాతో 2018లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ ఈ ఆరేళ్లలో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ సినిమా ఖాతాలో వేసుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో జాన్వీ యాక్టింగ్ బాగున్నా కూడా.. బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. 

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోవాల్సింది. కానీ.. చేజేతులా ఆమె కెరీర్‌‌ను అస్తవ్యస్థంగా మార్చుకుంది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి కమర్షియల్ సినిమాలను చేజార్చుకుంది. 

(7 / 8)

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోవాల్సింది. కానీ.. చేజేతులా ఆమె కెరీర్‌‌ను అస్తవ్యస్థంగా మార్చుకుంది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి కమర్షియల్ సినిమాలను చేజార్చుకుంది. (Sunil Khandare)

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్స్ కెరీర్ హిట్, ప్లాప్‌లపై ఆధారపడి ఉంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ వరుసగా మూడు ప్లాప్‌లు పడితే.. ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు. కాబట్టి జాన్వీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. 

(8 / 8)

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్స్ కెరీర్ హిట్, ప్లాప్‌లపై ఆధారపడి ఉంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ వరుసగా మూడు ప్లాప్‌లు పడితే.. ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు. కాబట్టి జాన్వీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. (Instagram/@janhvikapoor)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు