Pawan Meets KS CM: కర్ణాటక సిఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, కుంకీ ఏనుగుల కోసం విజ్ఞప్తి
- Pawan Meets KS CM: ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల్ని నియంత్రించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను అందించాలని కర్ణాటక సిఎం సిద్ధరామయ్యను పవన్ కళ్యాణ్ కోరారు.
- Pawan Meets KS CM: ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల్ని నియంత్రించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను అందించాలని కర్ణాటక సిఎం సిద్ధరామయ్యను పవన్ కళ్యాణ్ కోరారు.
(2 / 6)
చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ కళ్యాణ్ సిద్దరామయ్యకు వివరించారు.
(3 / 6)
బెంగళూరు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సురేంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు స్వాగతం పలికారు.
(5 / 6)
చిత్తూరు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల విషయంలో సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పార్వతీపురంతో పాటు చిత్తూరులోని పలమనేరు, కుప్పంలో పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. రైతుల్ని తొక్కి చంపుతున్నాయి. తరచుగా జనావాసాల్లోకి తరలి వస్తున్నాయి. మరోవైపు విద్యుత్ కంచెలతో 20ఏనుగులుప్రాణాలు కోల్పోయాయి. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి వరకు ఏనుగుల సంచారం ఉంది. దాదాపు 70 ఏనుగులు ఉన్నాయి వీటి కట్టడి కోసం కుంకీలను అందించాలని పవన్ కోరారు.
ఇతర గ్యాలరీలు