తెలుగు న్యూస్ / ఫోటో /
Pawan Kalyan : ముందు ఎమ్మెల్సీ ఆ తర్వాతే కేబినెట్ లోకి-నాగబాబుకు మంత్రి పదవిపై స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan : నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు ముందు ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆయన చేసిన త్యాగానికి రాజ్యసభ ఇద్దామని అనుకున్నా కుదర్లేదన్నారు.
(1 / 6)
నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు ముందు ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆయన చేసిన త్యాగానికి రాజ్యసభ ఇద్దామని అనుకున్నా కుదర్లేదన్నారు.
(2 / 6)
రాజకీయాల్లో పనితీరే ప్రామాణికమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తమ పార్టీలో మంత్రులు ఎంపిక కులం చూసి కాకుండా పనితీరును ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం మంగళగిరిలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
(3 / 6)
మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అన్నయ్య చిరంజీవి సొంతంగా ఎదిగారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలని పవన్ అన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా కష్టపడ్డారన్నారు.
(4 / 6)
నాగబాబు జనసేన కోసం నిలబడ్డారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక్కడ కులం, బంధుప్రీతి లేదని, పనిమంతుడా కాదా? అన్నదే చూడాలన్నారు. నాగబాబును ఎంపీగా ప్రకటించి, చివరకు తప్పించామన్నారు.
(5 / 6)
కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, ఆయన పనితీరు చూసి మంత్రి పదవి ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. మనోహర్, హరిప్రసాద్ పార్టీ కోసం ముందు నుంచీ కష్టపడ్డారన్నారు. ప్రతిభ ఆధారంగా పదవులు ఇస్తామన్నారు.
ఇతర గ్యాలరీలు