Weather Updates : మరింత బలపడనున్న అల్పపీడనం..! రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు, ఏపీకి IMD హెచ్చరికలు
- AP Telangana Weather Updates : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలోనూ వానలు కురవనున్నాయి.

(1 / 6)
ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం(సెప్టెంబర్ 1) నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(3 / 6)
శుక్ర,శనివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాతీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.
(4 / 6)
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
(5 / 6)
శుక్రవారం(30 ఆగష్టు,) అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు