TG DSC Exams 2024 : తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్ - విద్యాశాఖ కీలక నిర్ణయం
- Telangana DSC Exams 2024 : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఒకే రోజు రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటే అదే సెంటర్ లో రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది.
- Telangana DSC Exams 2024 : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఒకే రోజు రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటే అదే సెంటర్ లో రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది.
(1 / 6)
తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే.. మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి.
(2 / 6)
దూరంగా సెంటర్లు వేయటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఒక సెంటర్ లో రాసి… మధ్యాహ్నం మరో సెంటర్ లో పరీక్ష ఉంటే ఎలా చేరుకుంటామని ప్రశ్నిస్తున్నారు.
(image source from unsplash.com)(3 / 6)
పలువురు అభ్యర్థులు వేర్వురు పోస్టులకు దరఖాస్తు చేసుకోవటంతో పాటు మరికొందరు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటంతో వేరే జిల్లాల్లో సెంటర్లు వేశారు. దీంతో ఈ సమస్య తెరపైకి వచ్చింది.
(image source from unsplash.com)(4 / 6)
అభ్యర్థులు ఆందోళన చెందడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఒకే రోజు వేరువేరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పడిన వారికి హాల్‌టికెట్లను మార్చి మళ్లీ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
(image source from unsplash.com)(5 / 6)
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 18వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
(6 / 6)
జులై 18న మొదటి షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్‌టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింద "ఆన్‌లైన్"లో నిర్వహిస్తారు.
ఇతర గ్యాలరీలు