తెలుగు న్యూస్ / ఫోటో /
Delhi rains : భారీ వర్షాలకు అల్లాడిపోతున్న దిల్లీ- ఇప్పటికే 11 మంది..
- దేశ రాజధాని దిల్లీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇంకొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు.
- దేశ రాజధాని దిల్లీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇంకొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు.
(1 / 6)
శుక్రవారం 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన దిల్లీలో శనివారం మళ్లీ వర్షం కురిసింది. మొత్తం మీద వర్షాల కారణంగా ఇప్పటివరకు దిల్లీలో 11మంది మరణించారు.
(PTI)(2 / 6)
1936 తర్వాత దిల్లీలో ఒక రోజులో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
(PTI)(3 / 6)
రానున్న ఐదు రోజుల్లో హరియాణా-ఛండీగఢ్-దిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 29 నుంచి జూలై 1 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(PTI)(5 / 6)
రుతుపవనాలు శుక్రవారం ఢిల్లీకి ప్రవేశించి నగరంలోని వివిధ ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
(PTI)ఇతర గ్యాలరీలు