దిల్లీ భూకంపం- తీవ్రత తక్కువే, కానీ ప్రభావం ఎక్కువ! కారణం ఏంటి?
- భూకంపంతో దిల్లీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. వాస్తవానికి రిక్టార్ స్కేల్‌పై 4.0 తీవ్రత నమోదైనప్పటికీ, ప్రభావం ఎక్కువ కనిపించింది. ఎందుకిలా? నిపుణులు ఏమంటున్నారంటే..
- భూకంపంతో దిల్లీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. వాస్తవానికి రిక్టార్ స్కేల్‌పై 4.0 తీవ్రత నమోదైనప్పటికీ, ప్రభావం ఎక్కువ కనిపించింది. ఎందుకిలా? నిపుణులు ఏమంటున్నారంటే..
(1 / 5)
సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపంతో దిల్లీ-ఎన్సీఆర్ ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు సమాచారం లేకపోయినప్పటికీ.. భవనాలు కంపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
(X (PTI))(2 / 5)
10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దిల్లీ, నోయిడా, ఇందిరాపురం, ఇతర ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా చోట్ల నిద్రలో ఉన్న ప్రజలు భూకంపం ధాటికి హఠాత్తుగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
(X (@drmmeena83))(3 / 5)
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పాటించాలని, భూప్రకంపనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంతంగ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
(X (PTI))(4 / 5)
ధౌలా కువాన్లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రీకృతమైనట్టు అధికారులు తెలిపారు.
(X (PTI))(5 / 5)
తీవ్రత తక్కువే ఉన్నా, ప్రభావం ఎందుకు ఎక్కువ అనిపించింది? "మీరు చూసిన దిల్లీ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఇది ఎక్కువ కాదు (భూకంపాలు 6.0 అంతకంటే ఎక్కువ వరకు వెళ్లొచ్చు) కానీ మీరు మునుపటి కంటే పెద్ద ప్రకంపనలను అనుభవించారు. ఎందువల్ల? ఎందుకంటే భూకంప కేంద్రం దిల్లీలోనే ఉంది. భూకంప కేంద్రం వద్ద ప్రకంపనలు ఇలాగే ఉంటాయి," అని కలాం సెంటర్ అండ్ హోమీ ల్యాబ్ వ్యవస్థాపకుడు సృజన్ పాల్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
(X (@drmmeena83))ఇతర గ్యాలరీలు