BRS Mlc Kavitha : కేసీఆర్ బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా- ఎమ్మెల్సీ కవిత
- BRS Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాడ్లాడుతూ ‘నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
- BRS Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాడ్లాడుతూ ‘నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
(1 / 7)
'నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదని' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను అనవసరంగా జైలులో పెట్టి జగమొండిగా చేశారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోఎత్తుపల్లాలు చూశానన్నారు.
(2 / 7)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.
(3 / 7)
జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత కొడుకు, భర్త, అన్నను చూసి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాడ్లాడుతూ తన పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికర విషయం అన్నారు.
(4 / 7)
తనను ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత అన్నారు. మాకు సమయం వస్తుందని, తప్పకుండా తిరిగి చెల్లిస్తామన్నారు. ఇలాంటి కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా ఉన్నవారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు.
(5 / 7)
ఈ పరిస్థితికి రాజకీయాలే కారణమని కవిత అన్నారు. తనను జైలులో పెట్టడం వల్ల ఇంకా జగమొండిగా మారానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన పోరాటం కొనసాగుతోందన్నారు.
(6 / 7)
దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
ఇతర గ్యాలరీలు