Deepika Padukone: కల్కి హీరోయిన్ దీపికా పదుకొణె రెజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. ఓ హాలీవుడ్ మూవీ కూడా!
Deepika Padukone Rejected Blockbuster Hit Movies: ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె అనేక హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. కానీ, ఇటీవలే తల్లి అయిన ఈ ముద్దుగుమ్మ రెజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలపై లుక్కేద్దాం.
(1 / 7)
దీపికా పదుకొణె ఇటీవలే కుమార్తెకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సంతోషంలో మునిగితేలుతుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ సాధించిన దీపికా పదుకొణె తన కెరీర్‌లో చాలా పెద్ద సినిమాలను రెజెక్ట్ చేసింది.
(2 / 7)
షారుఖ్ ఖాన్ నటించిన జబ్ తక్ హై జాన్ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్స్‌గా నటించారు. వారిలో కత్రినా పాత్రకు మొదట దీపికా పదుకొణెను ఎంపిక చేశారు. కానీ ఆమె నిరాకరించింది.
(3 / 7)
సల్మాన్ ఖాన్ అనుష్క శర్మ జంటగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా సుల్తాన్. ఈ సినిమాలో మొదట దీపికాకు హీరోయిన్‌గా ఆఫర్ వస్తే.. ఈ ముద్దుగుమ్మ తిరస్కరించింది. ఫలితంగా మంచి హిట్‌కు దూరమైంది.
(4 / 7)
అమీర్ ఖాన్ 'ధూమ్ 3'లో దీపికా పదుకొణెకు హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. కానీ, దాన్ని కాదనుకుంది దీపికా పదుకొణె. ఇందులో కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
(5 / 7)
ఇప్పటివరకు హిందీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మిస్ చేసుకున్న దీపికా పదుకొణె ఒక హాలీవుడ్ క్రేజీ మూవీ సైతం కాలదన్నుకుంది. ఇండియాలోనే కుకండా వరల్డ్ వైడ్‌గా క్రేజీ ఫ్రాంచైజీ అయినా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఏడో భాగంలో నటించమని దీపికాకు ఆఫర్ వచ్చింది. కానీ ఆమె నిరాకరించింది.
(6 / 7)
2022లో విడుదలైన గంగూబాయి కతియావాడి సినిమాలో అలియా భట్ తన నటనతో అందరి హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ఆ సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాకు ముందు దీపికా పదుకొణెనే ఫస్ట్ ఛాయిస్.
ఇతర గ్యాలరీలు