
(1 / 5)
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలని జడాన్ గ్రామంలో సోమవారం ఉదయం క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి.

(2 / 5)
శిమ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 22మందిలో శిమ్లా నుంచే తొమ్మిది మంది ఉన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శివాలయం గోడ కూలి వీరు మరణించారు.

(3 / 5)
సోలన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం సంభవించిన క్లౌడ్ బరస్ట్‌తో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. జడోన్ గ్రామంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ఏడుగురు మరణించారు. వీరి వయస్సు 12- 36ఏళ్ల మధ్యలో ఉంటుంది.

(4 / 5)
ఉత్తరాఖండ్ పౌరి జిల్లాలోని యమ్కేశ్వర్ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి ఇలా మారింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

(5 / 5)
రిషికేశ్‌లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వరదలకు ఓ రోడ్డు కొట్టుకుపోయింది. దీనిని అధికారులు మరమ్మతు చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు