Davos WEF Summit : దావోస్ లో టీమ్ ఇండియా, అరకు కాఫీ- ఆర్థిక సదస్సు విశేషాలు
Davos WEF Summit : తెలుగు రాష్ట్రాల సీఎంలు, అధికారుల బృందాలు...దావోస్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుసగా వ్యాపార దిగ్గజాలను కలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను వ్యాపారులకు వివరిస్తున్నారు.
(1 / 7)
తెలుగు రాష్ట్రాల సీఎంలు, అధికారుల బృందాలు...దావోస్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుసగా వ్యాపార దిగ్గజాలను కలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను వ్యాపారులకు వివరిస్తున్నారు.
(2 / 7)
దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భేటీ అయ్యారు. ఈ ఫోటోను సీఎం చంద్రబాబు టీమ్ ఇండియా అని ఎక్స్ లో పోస్టు చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ వంటి అంశాలపై ముగ్గురు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది.
(3 / 7)
దావోస్‌లోని ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో అరకు కాఫీని అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అరకు కాఫీ హృదయాలను గెలుచుకుంటుందని లోకేశ్ అన్నారు.
(4 / 7)
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గుగూల్ ఇంటర్నేషనల్ మేనేజర్ ఆండ్రీ నకాజాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టెక్నాలజీలో తాజా పురోగతులను, ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన అవకాశాలపై చర్చించారు. ఏపీలోని ప్రతిభావంతులైన యువతతో, టెక్ భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.
(5 / 7)
టెమాసెక్ హోల్డింగ్స్‌లో ఇండియా స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. టెమాసెక్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ అయిన కాపిటా ల్యాండ్ ఏపీలో ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడి పెట్టడాన్ని పరగణించాలని కోరారు. REIT మోడల్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక క్లస్టర్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, అలాగే విశాఖపట్నం, తిరుపతిలో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు.
(6 / 7)
ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా దావోస్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు