Vemulawada Temple : శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన వేములవాడ-dasra navaratri celebrations 2023 at vemulawada temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vemulawada Temple : శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన వేములవాడ

Vemulawada Temple : శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన వేములవాడ

Published Oct 14, 2023 07:54 AM IST HT Telugu Desk
Published Oct 14, 2023 07:54 AM IST

  • Navaratri Celebrations At Vemulawada: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ క్షేత్రం ముస్తాబైంది. ఆదివారం నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో వేములవాడ ఆలయం శోభాయమానంగా కనిపిస్తోంది.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.  రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. 

(1 / 5)

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేవాలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఆలయం శోభాయమానంగా మారింది. 

(2 / 5)

ఉదయం స్వస్తిపుణ్యాహా వాచనం చేసి కళశపూజ,గణపతిపూజతో పాటు ఋత్విక్కరణం ఉంటుంది. అనంతరం రాజరాజేశ్వరీ దేవికి షష్టిఉపచార పూజలు చేశారు.  శైలపుత్రి అలంకరణలో మొదటి రోజు అమ్మవారు దర్శనమిస్తోందని...ఆలయ అర్చకులు తెలిపారు.

(3 / 5)

మొదటిరోజు శైలపుత్రి,రెండవరోజు బ్రహ్మచారిణి,మూడవరోజు చంద్రఘంట,నాలుగవరోజు కూష్మాండ,అయిదవరోజు  స్కందమాత,ఆరవరోజు కాత్యాయని,ఏడవరోజు కాళరాత్రి,ఎనిమిదవరోజు మహాగౌరి,తొమ్మిదవరోజు సిద్దిదాత్రి అదే రోజు సాయంత్రం విజయదుర్గా దేవిగా అమ్మవారు దర్శనమిస్తోందని పండితులు తెలిపారు.

(4 / 5)

తొమ్మిదవరోజైన దసరా రోజున ఆయుధపూజ,చండీహవనము,సాయంత్రం  పెద్దసేవ,గజవాహానము పై ఊరేగింపుతో పాటు ఏకాంతసేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు కొనసాగే నవరాత్రి ఉత్సవాలతో పాటు  బతుకమ్మ ఆటల కోసం ఆలయం వెనుక భాగంలో ఏర్పాటు చేశామన్నారు.  

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు