తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! ఏపీలో మరో 2 రోజులు వర్షాలు
- AP Telangana Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో మాత్రం పూర్తిగా పొడి వాతవరణమే ఉండనుంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
దక్షిణ మధ్య బంగాఖాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం... ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఏపీ, యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తాజా బులెటిన్ లో వివరించింది.
(2 / 7)
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. (@APSDMA)
(3 / 7)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ తెలిపింది. మరికొన్నిచోట్ల మెరుపులతో కూడిన జల్లులు పడుతాయని పేర్కొంది. సీమ జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. (@APSDMA)
(4 / 7)
ఇవాళ ఏపీలో (నవంబర్ 07, 2024) అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(@APSDMA)
(5 / 7)
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో తెలిపింది. (@APSDMA)
(6 / 7)
నవంబర్ 12, 13వ తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.(@APSDMA)
ఇతర గ్యాలరీలు