AP TG Rain ALERT : రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..!
- AP Telangana Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది డిసెంబర్ 7వ తేదీ కల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది డిసెంబర్ 7వ తేదీ కల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 8)
భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తాజా బులెటిన్ తెలిపింది.
(2 / 8)
సుమారు డిసెంబర్ 7వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
(3 / 8)
ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12వ తేదీ నాటికి శ్రీలంక - తమిళనాడు తీరాల వద్దకు చేరుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
(4 / 8)
ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు సీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(5 / 8)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(7 / 8)
రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం సమయంలో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇతర గ్యాలరీలు