తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Report : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
- AP Telangana Weather News : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం దక్షిమ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.
(2 / 6)
ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలుల వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(3 / 6)
ఉత్తర కోస్తాలో ఇవాళ ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. (image source pixabay )
(4 / 6)
మరోవైపు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. సీమ జిల్లాల్లో మోస్తారు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. (image source pixabay )
(5 / 6)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి నవంబర్ 16వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. (image source pixabay )
ఇతర గ్యాలరీలు