AP TG Weather Updates : బలపడిన అల్పపీడనం, తుఫాన్ గా మారే అవకాశం - ఏపీకి ముప్పు లేదన్న ఐఎండీ-cyclone is likely to form in the bay of bengal by may 25 imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : బలపడిన అల్పపీడనం, తుఫాన్ గా మారే అవకాశం - ఏపీకి ముప్పు లేదన్న ఐఎండీ

AP TG Weather Updates : బలపడిన అల్పపీడనం, తుఫాన్ గా మారే అవకాశం - ఏపీకి ముప్పు లేదన్న ఐఎండీ

May 23, 2024, 04:26 PM IST Maheshwaram Mahendra Chary
May 23, 2024, 04:26 PM , IST

  • AP Telangana Weather Updates : బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడినట్లు ఐఎండీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో రెండు మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇది రేపటికి అంటే శుక్రవారం(మే 24) నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

(1 / 6)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇది రేపటికి అంటే శుక్రవారం(మే 24) నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.(Photo Source @APSDMA Twitter)

ఇదే వాయుగుండం ఎల్లుండి(మే 25) నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ లో పేర్కొంది.

(2 / 6)

ఇదే వాయుగుండం ఎల్లుండి(మే 25) నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ లో పేర్కొంది.(Photo Source @APSDMA Twitter)

.మే 26సాయంత్రానికి బంగ్లాదేశ్& పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఏటువంటి ముప్పులేదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

(3 / 6)

.మే 26సాయంత్రానికి బంగ్లాదేశ్& పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఏటువంటి ముప్పులేదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.(Photo Source @APSDMA Twitter)

తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

(4 / 6)

తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.(Photo Source @APSDMA Twitter)

తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(5 / 6)

తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Photo Source @APSDMA Twitter)

తెలంగాణలో మే 25వ తేదీ నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది. 

(6 / 6)

తెలంగాణలో మే 25వ తేదీ నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది. (Photo Source @APSDMA Twitter)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు