Cyclone Gabrielle death toll : తుపాను ధాటికి న్యూజిలాండ్ విలవిల.. 11మంది మృతి
- Cyclone Gabrielle death toll : గాబ్రియెల్ తుపాను ధాటికి న్యూజిలాండ్ విలవిలలాడుతోంది. తుపాను నేపథ్యంలో మృతుల సంఖ్య 11కు చేరింది. వేలాది మంది గల్లంతవ్వడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాబ్రియెల్ తుపాను.. దేశంలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తుగా పేర్కొంది అక్కడి ప్రభుత్వం.

(1 / 5)
న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్‌ను ఫిబ్రవరి 12న గాబ్రియెల్ తుపాను తీరం దాటింది. హాకేస్ బే ప్రాంతంపై తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. మొత్తం మీద మృతుల సంఖ్య 11కు చేరింది. (AFP)
(2 / 5)
తుపాను కారణంగా 5,608మంది గల్లంతయ్యారు. మరో 1,196 మంది తాము సురక్షితంగా ఉన్నామని పోలీసులకు సమాచారం అందించారు. (AFP)
(3 / 5)
మోరివై, పిహా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. (AFP)
(4 / 5)
గాబ్రియెల్ తుపాను కారణంగా పలు ప్రాంతాలకు రవాణా వ్యవస్థ తెగిపోయింది. ఆయా ప్రాంతాల్లో.. హెలికాఫ్టర్ల సాయంతో ఆహార పదార్థాలు, దుస్తులు వంటి నిత్యావసర వస్తువులను అందించింది ప్రభుత్వం. (AFP)
(5 / 5)
శనివారం నాటికి దేశంలోని 62వేల నివాసాలు అంధకారంలోకి జారుకున్నాయి. వీటిల్లో 40వేల ఇళ్లు ఒక్క హాకేస్ బేలోనే ఉన్నాయి. (AFP)
ఇతర గ్యాలరీలు